వివాదాస్పద అంశాల్లో దూరి కేసులు దాకా తెచ్చుకుంటున్నారు కొంతమంది యూట్యూబర్లు. అయితే హద్దు దాటితే సెక్షన్లతో కొడుతోంది డిపార్ట్‌మెంట్. తాజాగా తెలుగు యూట్యూబర్ పై పలువురు యువకులు, మహిళలు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అత్తాపూర్ రాధకృష్ణానగర్ లో మంగళవారం రాత్రి జరిగింది.
రాజేంద్రనగర్‌లో యూట్యూబర్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబర్ గిరీష్‌పై దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బంది విధులను అడ్డుకోవడంతో పాటు దాడి చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. మొత్తం 45 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 40 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు తనపై, తన కార్యాలయంపై ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని ఆరోపించారు యూట్యూబర్ గిరీష్.
రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న యూట్యూబర్ గిరీష్ దారమోని.. ద చిత్రగుప్త్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై నిలదీసేందుకు ఇంటికెళ్లిన వారిపై కారంపొడితో గిరీష్ దాడి చేశారు. దీంతో గిరీష్ మెడలో చెప్పుల దండేసి ఊరేగించారు
Also read
- Papaya Benefits: ఆ సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయం.. పడుకునేముందు ఈ ఒక్క పండు తినండి
- Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
- Astrology: బుధుడు వెనక్కి వెళ్తున్నాడు.. లక్షాధికారులుగా మారే టైమ్.. ఈ 4 రాశులు లక్కీ!
- లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!
- Nagarkurnool: చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్…





