భూదేవి పిలిచిందంటూ ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించగా.. సరైన సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్న ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కైపు కోటిరెడ్డి పన్నెండేళ్ల క్రితం ఊరి శివారున తమ పొలంలో భూదేవి ఆలయాన్ని సొంతంగా నిర్మించాడు. తాను భూదేవి పుత్రుడిని.. తరచూ భూమాత తన ఒంట్లోకి వస్తుందని, తను భూగర్భంలోకి వెళ్లిపోతానంటూ సజీవ సమాధికి సిద్ధమయ్యాడు.
టెక్నాలజీ యుగంలో మనిషి ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాడు. అంతరిక్షానికి సైతం రాకపోకలు సాగిస్తున్న ఆధునిక యుగంలోనూ మనుషులు మూఢవిశ్వాసాలు వీడటంలేదా అంటే… అవుననే అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే. ఓ వ్యక్తి తాను భూదేవి పుత్రుడిని.. తరచూ భూమాత తన ఒంట్లోకి వస్తుందని, తను భూగర్భంలోకి వెళ్లిపోతానంటూ సజీవ సమాధికి సిద్ధమయ్యాడు. విషయం పోలీసులకు తెలియడంతో సకాలంలో అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి దీక్షను భగ్నం చేయడంతో బతికి బయటపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కైపు కోటిరెడ్డి కొన్నేళ్ల క్రితం ఊరి చివరలోని తన పొలంలో భూదేవి అమ్మవారి ఆలయం నిర్మించాడు. అక్కడ నిత్య పూజలు చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆలయ సమీపంలో ఆరడుగుల గొయ్యి తవ్వి అందులోకి వెళ్లి రోజూ ధ్యానం చేస్తున్నాడు. అంతేకాదు ఉగాది రోజు తను జీవసమాధి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున కుమారుడిని వెంటపెట్టుకొని ఆలయం వద్దకు చేరుకున్నాడు. తాను జీవసమాధి అవుతానని, అందుకు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గొయ్యిని కుమారుడికి చూపించి, తాను గొయ్యిలోపలికి వెళ్లి ధ్యానం చేసుకుంటానని, ఇనుప రేకును ఉంచి, దానిపై మట్టితో పూడ్చి వేయమని కుమారుడికి చెప్పి, గొయ్యిలో నగ్నంగా కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు. తండ్రి చెప్పినట్టుగా కుమారుడు సమాధి చేశాడు. కోటిరెడ్డి జీవసమాధి అవుతున్నాడన్న విషయం తెలుసుకొని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తక్షణం అక్కడికి చేరుకున్న పోలీసులు కోటిరెడ్డి దీక్షను భగ్నం చేసి ప్రాణాలతో బయటకు తీశారు. తాను ప్రపంచశాంతి కోసం దీక్ష చేస్తున్నానని కోటి రెడ్డి చెబుతున్నాడు
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





