బెంగళూరులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను సూట్‌కేస్‌లో నింపిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా రాజస్థాన్, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటం దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపుతున్నాయి. అయితే, ఈ తరహా దారుణం తాజాగా రాజధాని బెంగళూరులో జరగటం ప్రజల్లో మరింత ఆందోళన రేపుతోంది.
బెంగళూరులోని హులిమావు సమీపంలోని దొడ్డ కన్నహళ్లిలోని ఒక ఇంట్లో ఒక భర్త తన భార్యను చంపి, ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి సూట్‌కేస్‌లో కుక్కిన దారుణ సంఘటన జరిగింది. మహారాష్ట్రకు చెందిన నిందితుడు భర్త రాకేష్ తన భార్య గౌరీ అనిల్ సాంబేకర్ (32) ను హత్య చేసి, ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు చేసి సూట్‌కేస్‌లో నింపాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మహారాష్ట్ర పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా బెంగళూరులోని హులిమావు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏడాది కాలంగా మహారాష్ట్రకు చెందిన రాకేష్, గౌరీ అనిల్ సాంబేకర్ బెంగళూరులోని దొడ్డకమ్మనహళ్లిలోని ఒక ఇంట్లో నివాసం ఉంటూ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. కాగా రాకేష్. వర్క్-ఫ్రమ్-హోమ్ విధానం ప్రకారం ఇంటి నుండి పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, అతను ఈ హత్య ఎందుకు చేశాడనే దానిపై అధికారిక సమాచారం వెలువడలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కారణాలపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





