బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పీఎస్లో విచారణకు రావాల్సిన విష్ణుప్రియ, టేస్టీతేజ గైర్హాజరయ్యారు. వాళ్లిద్దరి తరఫున RJ శేఖర్ భాష వెళ్లి 3రోజుల సమయం కోరగా పోలీసులు అందుకు అంగీకరించారు. కేసుకు, మీడియాకు భయపడి వాళ్లిద్దరూ విచారణకు రాలేదని అతడు తెలిపాడు.
బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పీఎస్ పోలీసులు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విష్ణు ప్రియ, టేస్టీ తేజలకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఇవాళ విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో 4 గంటలకు పంజాగుట్ట పీఎస్లో విచారణకు రావాల్సిన విష్ణుప్రియ, టేస్టీ తేజ గైర్హాజరు అయినట్లు తెలిసింది. వాళ్లిద్దరి తరఫున పంజాగుట్ట పీఎస్కు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్, RJ శేఖర్ భాష వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా శేఖర్ భాష వాళ్లిద్దరి కోసం సమయం కోరినట్లు తెలిసింది.
3 రోజుల సమయం
దాదాపు 3 రోజుల సమయం కోరగా పోలీసులు అందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే విచారణకు విష్ణుప్రియ, టేస్టీ తేజ గైర్హాజరు కావడానికి గల కారణాన్ని శేఖర్ భాష చెప్పినట్లు తెలిసింది. ఈ కేసుకు, మీడియాకు భయపడి వాళ్లిద్దరూ విచారణకు రాలేదని అతడు వివరించినట్లు సమాచారం. పోలీసులు ఇచ్చిన గడువులోగా కచ్చితంగా వచ్చి విచారణకు హాజరవుతారని శేఖర్ భాషా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్ లను తెలిసి ప్రమోట్ చేసినా, తెలియక ప్రమోట్ చేసినా తప్పేనని అతడు పేర్కొన్నట్లు వార్తలు సాగుతున్నాయి. ఇదే అంశం గురించి తమ బిగ్ బాస్ గ్రూప్లో కూడా చాలా పెద్ద చర్చ జరిగిందని శేఖర్ భాష చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఆ చర్చల తర్వాత వారితో మాట్లాడి, వాళ్ళ తరఫున తానే పోలీస్ స్టేషన్కు వచ్చానని అతడు తెలిపినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో త్వరలో విష్ణు ప్రియ, టేస్టీ తేజ పంజాగుట్ట పీఎస్ పరిధిలో హాజరు కానున్నట్లు అర్థం అవుతోంది.
నోటీసులు
ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై పోలీసులు మరింత ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పంజాగుట్ట పీఎస్లో11మందిపై కేసు నమోదు అవ్వగా.. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన విష్ణుప్రియ, టేస్టీతేజకు తాజాగా పోలీసులు నోటీసులు పంపారు. ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని సమాచారం. పరారీలో ఉన్న వారు తమ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




