అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్దలను కాలువలో తోశాడు. ఈ ఘటనలో కుమారుడు సందీప్ ప్రాణాలతో బయటపడగా.. కుమార్తె కారుణ్య నీళ్లల్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది
నిన్న కాకినాడ.. ఈరోజు కోనసీమ.. రేపు ఇంకొచోట. కన్నబిడ్డలను కంటిపాపలను కాపాడాల్సిన కన్నతండ్రులే ఎందుకింత కర్కశంగా ప్రవర్తిస్తున్నాయి. బిడ్డల జోలికి వస్తే ఏ ప్రాణి కూడా ఊరుకోదు..అలాంటిది కష్టాలు వచ్చాయని, సరిగా చదవడం లేదని కన్నపిల్లలను అత్యంత కర్కశంగా ,మానవత్వం లేకుండా పొట్టనపెట్టుకుంటున్న మనుషులకు ఏంపోయే కాలం వచ్చిందో తెలియడం లేదు.
నీ చేతి గీతలు, తలరాతలే నువ్వు మర్చుకోలేవు కానీ..బిడ్డల పాలిట మరణశాసనాన్ని రాసే హక్కు ఎవరిచ్చారయ్యా నీకు. ఇలాంటి అభిప్రాయాలు ఎన్నో కాకినాడ ఘటన తర్వాత వ్యక్తమవుతున్నాయి. కాకినాడ ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే కోనసీమలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది
ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి ఓ తండ్రి కనిపించకుండా పోయాడు. కోనసీమలోని రామచంద్రపురం మండలం నెలపతిపాడు గ్రామ పరిధిలోని గణపతినగరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను కాలువలో తోసి చంపేయాలనుకున్నాడు. సందీప్(10), కారుణ్య (6) అనే బాలికను కాలువలోకి తోసి హత్య చేశాడు. ఈ ఘటనలో సందీప్ ప్రాణాలతో బయటపడగా.. కారుణ్య తండ్రి కర్కశత్వానికి బలైపోయింది.
అయితే ఈ ఘటన తర్వాత పిల్లి రాజు కనిపించడం లేదు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, లేదు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కనిపించకుండా పోయిన వారి తండ్రి పిల్లి రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చంటూ స్థానికులు అభిప్రాయపడుతున్నారు
కాకినాడలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. కన్న బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు. అత్యంత క్రూరంగా కాళ్లూ చేతులు కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి వారి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం రేపింది.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




