పెళ్లి చేసుకుంటనని ఓ యువతికి బాగా దగ్గరైన యువకుడు మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు ఏకంగా ప్రియుడి ఇంటికే వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అనంతరం బోరబండ పీఎస్లో ఫిర్యాదు చేసింది.
ఫ్రెండ్స్ అన్నాడు.. ఆ తరువాత లవ్ అన్నాడు. పెళ్లి చేసుకుంటా అని బాగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి విషయం మాట్లాడితే నా కులం వేరు.. నీది వేరు ఇంట్లో ఒప్పుకోరని మాటమార్చాడు. మరో అమ్మాయితో సిక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు ఏకంగా ప్రియుడి ఇంటికే వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో రచ్చ రచ్చ అయింది.
ఇంతకు ఏం జరిగిదంటే.. బోరబండకి చెందిన ఓ యువతికి డ్రైవర్ రాకేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాకేష్ ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఇంట్లో మన పెళ్లికి అంగీకరించరని ఇంట్లో చూసిన అమ్మాయిని ముందుగా పెళ్లి చేసుకుంటానని.. టైమ్ చూసి నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు రాకేష్.
ఆర్థిక సమస్యలతో ఉద్యోగం కోసం
అయితే ఆర్థిక సమస్యలతో ఉద్యోగం కోసం ఆ యువతి ఖతర్ కు వెళ్లింది. ఇదే మంచి టైమ్ అనుకుని రాకేష్ ఇంట్లో చూసిన అమ్మాయితో ఎంగెజ్ మెంట్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు ఫిబ్రవరి 18వ తేదీన హైదరాబాద్ కు వచ్చింది. ప్రేమ వ్యవహారంపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. దీంతో అక్కడికి చేరుకున్న రాకేష్.. పెళ్లి చేసుకుంటానని మళ్లీ నమ్మించాడు
రాకేష్ ఇంటికి వెళ్లి ఆత్మహత్యయత్నం
రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పడంతో మళ్లీ ఖతర్ వెళ్లమని చెప్పడంతో ఆ యువతి ఖతర్ వెళ్ళిపోయింది. అయితే మార్చి 12న రాకేష్ పెళ్లి అని తెలియడంతో ఖతర్ నుంచి వచ్చి నేరుగా రాకేష్ ఇంటికి వెళ్లి అక్కడ అత్మహత్యయత్నానికి పాల్పడింది. అనంతరం యువతి బోరబండ పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు ప్రియుడు రాకేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పటికే ఆ యువతికి రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలుస్తోంది
Also read
- Telangana: కౌలుభూమిపై కన్నేసి దారుణం.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!
- నేటి జాతకములు.18 మార్చి, 2025
- Papmochani Ekadashi: పాపమోచని ఏకాదశి ఎప్పుడు? ప్రాముఖ్యత? పూజా విధానం గురించి తెలుసుకోండి..
- వయస్సు 19.. ‘నేను మీ అక్కనిరా’ అంటూ.. స్కూల్ విద్యార్థులను వ్యభిచారంలోకి దింపి..
- ప్రొఫెసర్ కాదు కామాంధుడు… వీడియోలు తీసి కోరికలు తీర్చాలంటూ టార్చర్!