హైదరాబాద్ లో మరోసారి గంజాయి కలకలం రేపింది. హోలీ ముసుగులో గంజాయి ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాతో తయారుచేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్, బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
Hyd Drugs: హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి గంజాయి కలకలం రేపింది. హోలీ ముసుగులో గంజాయి ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయితో తయారుచేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్, బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
ధూల్‌పేట్ మల్చిపురాలో..
ఈ మేరకు నగరమంతా రంగుల్లో మునిగితేలుతుంటే లోయర్ ధూల్‌పేట్ మల్చిపురాలో మాత్రం కొంతమంది గంజాయి మత్తులో ఊగుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గంజాయితో తయారు చేసిన 100 కుల్ఫీ, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయి మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్ముతున్నట్లు ఎక్సైజ్ఎన్ ఫోర్స్ మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. సత్యనారాయణపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ చేపట్టిన పోలీస్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ప్రశంసించారు.
ఇదిలా ఉంటే.. హోలీ సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. హోటల్స్, పబ్, రిసార్టుల్లో పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఈవెంట్ నిర్వాహకులు సినీ తారలు రాబోతున్నారంటూ హంగామా చేశారు. కస్టమర్లను ఆకర్షించేలా హోర్డింగ్ ఏర్పాటు చేసి టికెట్లు విక్రయించారు. భారీగా డబ్బులు వసూల్ చేసి చేతులెత్తయడంతో జనాలంతా లబోదిబోమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also read
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?
- శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే!





