బాలానగర్ (తెలంగాణ) : నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఎపి రాష్ట్రం విజయనగరం జిల్లా, తర్లా మండలం నందిగామకు చెందిన ఈశ్వరరావుతో గత ఫిబ్రవరి 6వ తేదీన గంటా విజయ గౌరీ (23) కి వివాహం జరిగింది. నూతన దంపతులు తెలంగాణ రాష్ట్రం బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్లో నివాసముంటున్నారు. ఈశ్వరరావు డ్యూటీకి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి విజయగౌరి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ ఇన్స్పెక్టర్ టి.నరసింహరాజు తెలిపారు
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





