March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

అన్నమయ్య-జిల్లా మహిళపై సామూహిక అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి..


నిమ్మనపల్లె(అన్నమయ్య జిల్లా) : సమాజంలో మహిళల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఓవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే సందర్భంలో.. మహిళల భద్రతపై టిడిపి కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనంగా, సభ్య సమాజం తలదించుకునేలా ఓ వివాహితను బెదిరించి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో ఈ దారుణం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు…నిమ్మనపల్లె మండలం, తవళం పంచాయతీ నాయునివారిపల్లికి చెందిన ఓ వివాహిత గత నెల 27న సాయంత్రం పాలు పోయడానికి సమీప గ్రామమైన నల్లంవారిపల్లికి కాలినడకన వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా నల్లంవారిపల్లెకు చెందిన నాగేంద్ర, సురేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే ఆమె భర్తను చంపేస్తామని నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై మదనపడుతూ పక్కింటి మహిళకు జరిగిన దారుణాన్ని ఆమె వివరించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు ఈ విషయం ఆమె తెలపడంతో అత్యాచార ఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న మదనపల్లె రూరల్‌ సిఐ సత్యనారాయణ, స్థానిక ఎస్‌ఐ తిప్పేస్వామితో కలిసి గ్రామానికి చేరుకొని బాధితురాలిని విచారించారు. వైద్యపరీక్షల నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు

Also read

Related posts

Share via