March 15, 2025
SGSTV NEWS
CrimeTelangana

దేవతనా.. లేక ఆత్మనా..? ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా నిప్పుల వర్షం.. క్షణం క్షణం భయం భయం..

ఆ కాలనీలో మంటలు చెలరేగుతున్నాయి.. ఒకటి కాదు.. రెండు కాదు.. గత మూడు నెలలుగా అంతు చిక్కని మంటలతో ఆందోళన చెందుతున్నారు ఆ ప్రాంతవాసులు… అంత బాగానే ఉన్న ఈ ప్రాంతంలో అగ్గి టెన్షన్ పుట్టిస్తుండటం సంచలనంగా మారింది.. కాలనీలో అకస్మాత్తుగా మంటలు ఎందుకు వస్తున్నాయో అర్ధం కావడం లేదు.. దీంతో అంతటా భయాందోళన నెలకొంది.


ఆ కాలనీలో మంటలు చెలరేగుతున్నాయి.. ఒకటి కాదు.. రెండు కాదు.. గత మూడు నెలలుగా అంతు చిక్కని మంటలతో ఆందోళన చెందుతున్నారు ఆ ప్రాంతవాసులు… అంత బాగానే ఉన్న ఈ ప్రాంతంలో అగ్గి టెన్షన్ పుట్టిస్తుండటం సంచలనంగా మారింది.. కాలనీలో అకస్మాత్తుగా మంటలు ఎందుకు వస్తున్నాయో అర్ధం కావడం లేదు.. పై కప్పు నుంచి మంటలు వస్తుండటం.. కాలనీ వాసులు వెంటనే ఆర్పేస్తుండటం కలకలం రేపుతోంది.. ఇలా తరచుగా మంటలు రావడంతో స్థానికులు పరుగులు తీస్తున్నారు..ఈ మంటల బాధ నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని మార్కండేయ కాలనీలో మంటలు ఎందుకు వస్తున్నాయో.. ఎవరికి అర్థం కావడం లేదు.


రాత్రి, పగలు తేడా లేకుండా నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ మంటలకు కారణం ఓ దేవత పనేనని భూత వైద్యుడు చెప్పడంతో ఆ ప్రాంతంలో బోనాలు చేసి, గట్టు మైసమ్మను ఆలయాన్ని ప్రతిష్టించారు ఆ కాళీవాసులు.. అయితే కొద్ది రోజులపాటు మంటలు బంద్ కావడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు. తిరిగి యధావిధిగా మంటలు చెలరేగి, ఆ కాలనీలోని గుడిసెలను మంటలు అంటుకోవడంతో ఏం చేయాలో అర్ధకావడం లేదు.. దీంతో కూలి పనులకు సైతం వెళ్లకుండా.. ఏ వైపు నుంచి మంటలు అంటుకుంటాయోనని ఇంటి చుట్టూ కాపలాకాస్తున్నారు స్థానికులు.. అయితే తమకు సీసీ కెమెరాలు పెట్టుకునే స్తోమత లేకపోవడంతో తమ ఇంట్లో ఉన్న వృద్ధులను ఇంటి చుట్టూ 24 గంటలు కాపలా పెట్టి తమ ఇళ్లను, ఇంటి సామాగ్రిని కాపాడుకుంటున్నామని కాలనీ వాసులు చెబుతున్నారు.

అయితే రాత్రి, పగలు తేడా లేకుండా ఈ మంటలు రావడానికి కారణం ఈ ప్రాంతంలో ఒక ఆత్మ తిరుగుతూ ఉందని ఓ వ్యక్తి చెప్పడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ఆ ఆత్మ చేస్తున్న పనేనని, ఈ మంటలకు కారణం ఆ ఆత్మేనని.. తాను ప్రత్యేక్షంగా చూశానంటూ అతను చెప్పడంతో జనం భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Also read

Related posts

Share via