March 12, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ధూల్‌పేటలో ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం.. స్పెషల్‌ డ్రైవ్‌లో పోలీసులు షాక్‌..!



Hyderabad: బయటి ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను గుర్తించి వారితో కోడ్ లాంగ్వేజ్ లో సంభాషించి గంజాయిని అమ్ముతున్నారు. ధూల్‌పేట్‌లో ప్రధానంగా మూడు కోట్ల వరకు గంజాయిని విక్రయిస్తున్నారు. ఈ గంజాయిని దోష మాల్ పూడిలా పేర్లతో విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నారు..


ఆపరేషన్ ధూల్‌పేట్. మొన్న ఎక్సైజ్ శాఖ చేపట్టిన ఆపరేషన్ ఇది. పెద్ద ఎత్తున గంజాయి దొరకడం ఎక్సైజ్ శాఖ సైతం ఉక్కు పాదం మోపడం ఇవన్నీ చూస్తుంటే ఇక ధూల్‌పేట్ మొత్తం గంజాయి రహిత వాడగా మారుతుందని అనుకున్నారంతా. పోలీసులు సైతం ఇదే మాట చెప్పారు ప్రజలు సైతం ఇదే నమ్మారు. మరి నిజంగానే ధూల్‌పేట్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా మారిందా లేదంటే ఆపరేషన్ ధూల్‌పేట్ వార్తలకి మాత్రమే పరిమితమైందా? టీవీ9 నిఘా నేత్రంలో బయటపడ్డ నిజాలు ఏంటి?


అడుక్కునే వారికి 60 కూరలు అలాగే గంజాయి అమ్మే వారికి 60 దారులు. ఏ ఒక్క దారి పోలీసులు మూసివేసిన ఇంకో దారిలో గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. నగరంలో కాదు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికిన దాని మూలాలు మాత్రం ధూల్‌పేటలోనే ఉన్నాయి. అందుకే ఎక్సైజ్ శాఖ ఆపరేషన్ ధూల్‌పేట్ అనే పేరుతో ఓ డ్రైవ్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో పెద్ద ఎత్తున గాంజా దొరికింది ధూల్‌పేట్ మొత్తాన్ని అష్టదిగ్బంధనంలా చేసి మళ్లీ గంజాయి అమ్మకుండా ఉక్కు పాదం మోపారు ఎక్సైజ్ పోలీసులు. ఎవరైనా గంజాయి అమ్మిన కొన్న కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి నిజంగానే దూల్పేట గంజాయి రహిత ఏరియాగా మారిందా? అని స్ప్రింగ్ ఆపరేషన్ చేసిన టీవీ9 కు ఒళ్ళు గగుర్పాటు కు లోనయ్యే విషయాలు తెలిశాయి. అసలు ఆపరేషన్ ధూల్‌పేట్ అని ఎక్సైజ్ శాఖ పోలీసులు చేపట్టిన ఈ డ్రైవ్ కు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా మారలేదని విషయాలు తెలిశాయి.

దోష మాల్ పూడి ఇదేంటి హోటల్ లో టిఫిన్ లో పేరు చెప్తున్నారని అనుకుంటున్నారా? కాదండి బాబు దూల్పేటలో గంజాయి కావాలని అడిగితే ఎవరూ ఇవ్వరు. ఇలాంటి కోడ్ పేరుతో చెబితే మాత్రమే గాంజాయి దొరుకుతుంది. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఇలాంటి కోడి భాషతో విక్రయాలు జరుపుతున్నారు గంజాయి బ్యాచ్. ఈ గంజాయి అమ్మేవారంతా మైనర్లే కావడం ఆందోళన కలిగించే అంశం. అయితే ఈ గంజాయి అమ్మి పెడితే భారీగా కమిషన్లు రావడంతో చాలామంది యువత మైనర్లు ఈజీగా ఈ గంజాయి అమ్మకాలు చేపడుతున్నారు


మీరు చూస్తున్న ఈ ప్రాంతం ధూల్‌పేట్‌లోని సాయినగర్ ఈ స్థలంలోనే ఇప్పుడు గంజాయి విచ్చలవిడిగా లభిస్తుంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు ఆపరేషన్ ధూల్‌పేట్ చేపట్టడంతో గంజాయి అమ్మకం దారులు కొత్త దారుల్లో గంజాయిని విక్రయిస్తున్నారు. ధూల్‌పేట్ లోని స్థానిక యువతకు డిపి లాంటి కోడ్ లాంగ్వేజ్ ఉన్న వ్యక్తులే గంజాయి అమ్మే వారి ఇంట్లోకి వెళ్లి గంజాయి తీసుకువచ్చి బయటి ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ధూల్‌పేట్ లోని సాయి నగర్ కాలనీ పై ఎక్సైజ్ అధికారుల నిఘా ఉండడంతో ఆ ప్రాంతాన్ని వదిలి పక్క ప్రాంతంలో గంజాయిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను గుర్తించి వారితో కోడ్ లాంగ్వేజ్ లో సంభాషించి గంజాయిని అమ్ముతున్నారు. ధూల్‌పేట్‌లో ప్రధానంగా మూడు కోట్ల వరకు గంజాయిని విక్రయిస్తున్నారు. ఈ గంజాయిని దోష మాల్ పూడిలా పేర్లతో విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నారు అక్కడి స్థానిక యువత. అయితే గంజాయి అమ్మే వ్యక్తులు కొత్త పద్ధతుల్లో గంజాయిని ధూల్‌పేట్‌లో విక్రయిస్తున్నారు. స్థానికంగా ఉండే వ్యక్తుల కదలికలపై నిఘా పెరగడంతో మైనర్లుగా ఉండే వారిని ఉపయోగించుకొని గాంజాయిని విక్రయిస్తున్నారు.

మరి ఎక్సైజ్ పోలీసులు ఇంతలా ఉక్కు పాదం మోపుతున్న గంజాయి అరికట్టక పోవడానికి ప్రధాన కారణం చిన్న చేపల్ని పట్టుకొని పెద్ద చేపల్ని వదిలిపెట్టడమే. అంటే చిన్న చిట్కా డ్రెస్ దందా చేసే వారిని కాకుండా బడా గంజాయి స్మగ్లర్లను పట్టుకొని కటకటాల వెనకాల కి పంపిస్తేనే ఈ గంజాయి దందాను అరికట్టవచ్చు.

Also read

Related posts

Share via