పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు అధికారులు. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా అని అన్నారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. ఉదయం నుంచి పోసాని నాటకం ఆడారని తెలిపారు. పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని అన్నారు.
పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు అధికారులు. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా అని అన్నారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. ఉదయం నుంచి పోసాని అనారోగ్యమంటూ నాటకం ఆడారని తెలిపారు. పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని అన్నారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా కడప రిమ్స్‌లో కూడా పరీక్షలు చేయించామని తెలిపారు. పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. దీంతో రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామని వెల్లడించారు.
అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు
రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ ముందుగా వార్తలు వచ్చాయి. వెంటనే జైలు అధికారులు సబ్ జైలు నుంచి ఆయన్ను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారని, అక్కడ వైద్యులు చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారనేది ఆ వార్తల సరాంశం. కాగా ఛాతి నొప్పితో గతకొంతకాలంగా బాధపడుతున్నారు పోసాని. ఇక పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. పోసానిని కోర్టు రిమాండ్ అనంతరం రాజంపేట సబ్ జైలుకు తరలించారు.
జోగినేని మణి ఫిర్యాదు మేరకు
కాగా జనసేన నాయకుడు జోగినేని మణి (Jogineni Mani) 2025 ఫిబ్రవరి 24వ తేదీన పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోసానిపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి26వ తేదీన హైదరాబాద్‌లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి పోసానిని ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు
Also read
- BREAKING: అఘోరి అరెస్ట్.. కారుతోపాటు ఈడ్చుకెళ్లిన పోలీసులు!
- ట్యాక్సీ డ్రైవర్‌తో కూతురు వివాహం.. తండ్రి, సోదరుడు అతికిరాతంగా ఏం చేశారంటే?
- TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా