March 15, 2025
SGSTV NEWS
CrimeTelangana

HYD Crime: కేపీహెచ్‌బీలో కలకలం.. పూజశ్రీ ఎందుకు చనిపోయింది?


హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో పూజశ్రీ అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 6వ ఫేజ్లోని ఎలగెంట్ అభిరుచి అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ నంబర్ 204లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


HYD Crime: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పూజశ్రీ అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్లోని ఎలగెంట్ అభిరుచి అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ నంబర్ 204లో బండ్ల పూజశ్రీ (31) నివాసం ఉంటుతోంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. పూజశ్రీ మృతి విషయం తెలుసుకున్న సోదరి సౌమ్యశ్రీ కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం ఇచ్చారు

అనుమాస్పద మృతి:
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పూజశ్రీ మృతిపై భర్త సునీల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చెపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూజశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూజశ్రీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై శ్రీలత తెలిపారు

Also read

Related posts

Share via