March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Chittoor Crime News: నాడు ప్రియుడితో పరార్‌, నేడు ఆత్మహత్య – శివరాత్రి రోజున ఆమె లైఫ్‌లో ఎన్నెన్నో మలుపులు!


Chittoor Crime News: చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ విచిత్రమైన విషాధ ఘటన వెలుగు చూసింది. శివరాత్రి రోజున ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందులో చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి.

Chittoor Crime News: శివరాత్రి ఆమె కుటుంబాని కాళరాత్రి అవుతుంది. గతేడాది చేసిన తప్పునకు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈసారి చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకుంది. కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తే నిజంగా ఇలాంటివి జరుగుతుంటాయా అనే అనుమానం కలుగుతుంది. కొన్ని ఘటనలు నిజంగా జరిగాయని విన్న తర్వాత భయం కలుగుతుంది. అలాంటి ఘటనే ఇది

పలమనేరుకు చెందిన ఓ మహిళ గత శివరాత్రికి ప్రియుడితే వెళ్లిపోయింది. అనూహ్యంగా కేసుల్లో ఇరుక్కొని జైలు పాలైంది. సరే భర్త మంచి వాడు కాబట్టి ఆమెను మళ్లీ ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు చిన్నపాటి విషయానికి ఆమె గొడవపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వాళ్లంతా ఆటగదరా శివా అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.  

బోడిరెడ్డిపల్లికి జగన్నాథం, కోమల దంపతులకు పెళ్లి జరిగి ఏడేళ్లకుపైనే అవుతుంది. ఇద్దరు సంతానం. ఇంట్లో జరిగిన చిన్నపాటి విషయానికే ఆమె సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. గతేడాది అలా జరిగింది ఈసారి ఆమె ప్రాణాలే తీసుకుందని అనుకుంటున్నారు. 

కోమల గతేడాది శివరాత్రి రోజు పెద్ద తంతంగాన్నే నడిపింది. శివరాత్రి రోజున జాగరణ చేస్తున్నానని చెప్పి ఆలయానికి వెళ్లింది. అక్కడి నుంచి ప్రియుడు గౌతమ్‌తో పరారైంది. వీళ్లిద్దరు వెళ్తుండగా కథ మలుపు తిరిగింది. వీళ్ల వినయ్ అనే వ్యక్తి వెంటపడ్డాడు. ఈ వినయ్ అనే వ్యక్తి ఆ రూట్‌లో వచ్చే జంటలను టార్గెట్ చేస్తుంటాడు. వారి వద్ద డబ్బు, నగలు దోచుకుంటారు. బెదిరించి వారిపై అత్యాచారం కూడా చేసేవాడు.

అలాంటి వినయ్‌ కంటే కోమల, గౌతమ్‌ పడ్డారు. వాడు ఈ జంటను కూడా ఆపి బెదిరించారు. వినయ్ చెప్పినట్టు చేసేందుకు మాత్రం వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో వారిపై దాడికి యత్నించాడు. ఆ దాడిని జంట అడ్డుకుంది. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో వినయ్ కిందపడిపోయాడు. వెంటనే గౌతమ్‌, కోమల వాడిపై దాడి చేశారు. పెద్ద బండరాయి తీసుకొచ్చి తలపై పడేశారు. 

వినయ్ స్పాట్‌లోనే చనిపోయాడు. ఆ విషయాన్ని గుర్తించిన వినయ్‌, కోమల అక్కడి నుంచి జారుకున్నారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేశారు. హత్య చేశామన్న భయంతో కోమల, గౌతమ్‌ పోలీసులకు లొంగిపోయారు.

వినయ్ హత్య కేసులో గౌతమ్‌, కోమలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అరెస్టు విషయం తెలుసుకున్న కోమల బంధువులు ఆమెతో మాట్లాడి బెయిల్ ఇప్పించారు. మళ్లీ తప్పు చేయబోనని భర్తకు , బంధువులకు మాట కూడా ఇచ్చింది. తప్పు తెలుసుకుందని ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు భర్త. ఇన్ని రోజులు సాఫిగా సాగిన సంసారంలో మళ్లీ కలతలు మొదలయ్యాయి. ఏదో చిన్న గొడవకు తీవ్ర నస్థాపానికి గురైంది కోమల. అంతే భర్తపై కోపంతో స్థానికంగా ఉండే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా శివరాత్రి రోజునే రెండు దుర్ఘటనలు జరగడం ఆ కుటుంబం తీవ్ర విషదంలో కూరుకుపోయింది.

Also read

Related posts

Share via