సినీ దర్శకుడు శంకర్ కు ED బిగ్ షాక్ ఇచ్చింది. 2011లో ‘రోబో’ సినిమా కథను కాపీ కొట్టారంటూ తమిళ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్ వేసిన కేసులో శంకర్‌కు చెందిన రూ.10.11 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.1957 సెక్షన్ 63ను శంకర్ ఉల్లంఘించినట్లు తెలిపింది.
Director Shanker: సినీ దర్శకుడు శంకర్ కు ED బిగ్ షాక్ ఇచ్చింది. 2011లో ‘రోబో’ సినిమా కథను కాపీ కొట్టారంటూ తమిళ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్ వేసిన కేసులో శంకర్‌కు చెందిన రూ.10.11 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.1957 సెక్షన్ 63ను శంకర్ ఉల్లంఘించినట్లు తెలిపింది.
‘జిగుబా’ పుస్తకంలోని కథ..
ఈ మేరకు రచయిత ఆరూర్ తమిళనాథన్ తన ‘జిగుబా’ పుస్తకంలోని కథను శంకర్ కాపీ కొట్టారంటూ 2011లో ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన కథతోనే ‘రోబో’ సినిమా తీశాడని, కాపీరైట్ యాక్ట్ 1957ను అతిక్రమించినందుకు శంకర్ పై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో విచారణ చేపట్టిన ఎగ్మోర్ కోర్ట్.. ఆ సినిమా ద్వారా రూ.11.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు గుర్తించింది. ఈడీ శంకర్ కు చెందిన ఆస్తులను అటాచ్ చేయగా శంకర్ ఇంకా దీనిపై స్పందించలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై ‘రోబో’ రూ. 290 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





