వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ, లాభం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాంతో కోచ్ సహా జిమ్ సిబ్బంది షాక్ కి గురయ్యారు.
Powerlifter Lost Life : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత అప్రమత్తంగా ఉన్నా చావుని తప్పించుకోలేము అంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఊహించని రీతిలో ప్రాణం పోవడం ఖాయం. తాజాగా రాజస్తాన్ లో అలాంటి ఘటనే జరిగింది. కోచ్ పర్యవేక్షణలో వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయింది యువ వెయిట్ లిఫ్టర్.
రాజస్తాన్ లో బికనీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిమ్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఊహించని విధంగా ఘోరం జరిగింది. యువ వెయిట్ లిఫ్టర్ ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యస్తిక ఆచార్య (17) వెయిట్ లిఫ్టర్. తన కోచ్ పర్యవేక్షణలో ఆమె జిమ్ లో ప్రాక్టీస్ చేస్తోంది. ఇందులో భాగంగా 270 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తోంది. అయితే, ఊహించని విధంగా.. చేతిలో నుంచి రాడ్ జారి ఆమె పై పడింది. అంతే.. యస్తిక ఆచార్య అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ, లాభం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాంతో కోచ్ సహా జిమ్ సిబ్బంది షాక్ కి గురయ్యారు.
270 కిలోల రాడ్ మెడపై పడటంతో.. ఆమె మెడ విరిగిపోయింది. యస్తికను ట్రైన్ చేస్తున్న కోచ్ కి కూడా స్వల్పంగా గాయలయ్యాయి. పవర్ లిఫ్టింగ్ లో యస్తిక రాణిస్తోంది. యస్తిక ఆచార్య జూనియర్ నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కూడా గెలుచుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యస్తిక.. ఇలా అర్ధాంతరంగా చనిపోవడాన్ని కుటుంబసభ్యులు, కోచ్, సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. యస్తిక దుర్మరణం క్రీడా ప్రపంచానికి తీరని లోటుగా అభివర్ణించారు.
ఈ దుర్ఘటన క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రాక్టీస్ సమయంలో మరింత భద్రతా ఏర్పాట్లు అవసరం అని చెప్పడానికి ఈ దుర్ఘటనే నిదర్శనం. ప్రాక్టీస్ లో భాగంగా 270 కిలోల బరువున్న రాడ్ ను యస్తిక పైకి లేపింది. వెనుకే ఉన్న కోచ్ ఆమెకు సాయం చేస్తున్నారు. అయితే, బరువు ఎక్కువగా ఉన్న క్రమంలో ఆమె దాన్ని అదుపు చేసుకోలేకపోయింది. అదే సమయంలో ఆమె కాలు స్లిప్ అయ్యింది. అంతే, ఆ రాడ్ జారి ఆమె మెడపై పడింది. వెనుకే ఉన్న కోచ్ కూడా ఏమీ చేయలేకపోయాడు. రాడ్ మెడపై నుంచి కిందకు జారి పడింది.
అదే సమయంలో వెనుకే ఉన్న కోచ్ ముఖానికి ఆమె తల బలంగా తాకింది. అంతే.. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. అంత బరువున్న రాడ్ మీద పడటంతో ఆమె మెడ విరిగింది. ఆమె తల బలంగా తాకడంతో కోచ్ కి కూడా గాయాలయ్యాయి. రాడ్ మెడపై పడటంతో యస్తిక స్పాట్ లోనే కుప్పకూలిపోయింది. చలనం లేకుండా నేలపై పడిపోయింది. ఇదంతా కళ్లారా చూసిన సిబ్బంది షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఒక ప్రాణం పోయింది.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..