నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ ఫెన్సింగ్ వేసి అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవాలనుకున్న రైతు కుటుంబం విద్యుత్‌ఘాతంతో చనిపోయింది. కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కొడుకు మృతి చెందారు.
విద్యుత్‌షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో చోటుచేసుకుంది. గంగారం అనే రైతు పంట చేలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. వాటి నుంచి పంటను రక్షించుకోడానికి కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో పొలం దగ్గర బోరు మోటర్ కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురైయ్యారు. దీంతో రైతు, ఆయన భార్య బాలమణి, వారి కొడుకు కిషన్ అక్కడిక్కడే చనిపోయారు.
ఒకే కుటుంబానికి మగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. బంధువులు తీవ్రం విషాదంలో ముగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025