సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజలింగమూర్తి కోర్టుకు రాకూడదనే, కాంట్రాక్టర్లే ఆయన్ను చంపారంటూ స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో మేఘా కంపెనీపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి
సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఘటన ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. 2025 ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం రాత్రి ఆటోలో వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని దుండగులు రాజలింగమూర్తిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో పేగులు భయటపడటంతో రాజలింగమూర్తి స్పాట్ లోనే మృతి చెందాడు. అయితే రాజలింగమూర్తి హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా కాళేశ్వరం స్కామ్‌పై గత కొంతకాలంగా రాజలింగమూర్తి పోరాటం చేస్తున్నారు. కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా వేశారు. ఇవాళ కాళేశ్వరం కేసుపై హైకోర్టులో విచారణ ఉండగా నిన్న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజలింగమూర్తి కోర్టుకు రాకూడదనే చంపేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి. కాంట్రాక్టర్లే రాజలింగమూర్తిని చంపారంటూ స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో మేఘా కంపెనీపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
కాళేశ్వరం అవకతవకలపై
కాళేశ్వరం అవకతవకలపై మేఘాకృష్ణారెడ్డితో పాటు కేసీఆర్, హరీష్‌రావు, పలు ఐఏఎస్ అధికారులపై కేసు నమోదు కోసం కోర్టుల చుట్టూ తిరిగారు రాజలింగమూర్తి. ఈ కేసులో ఇప్పటికే మేఘాకృష్ణారెడ్డి, కేసీఆర్, హరీష్ రావు, స్మితాసభర్వాల్‌కు భూపాలపల్లి సెషన్స్‌కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని అధికార కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఒక్క ప్రాజెక్టులోనే ప్రభుత్వ సహకారంతో మేఘా కృష్ణారెడ్డి వేల కోట్ల ప్రజాసొమ్మును దోచుకున్నాడన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
భూపాలపల్లి మున్సిపాలిటీలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజలింగమూర్తి భార్య సరళ గత పాలకవర్గంలో బీఆర్ఎస్ తరఫున 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచింది. కాగా బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో రాజలింగమూర్తి పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చాక కేసీఆర్, హరీష్ రావులతో పాటుగా మరికొంతమంది అధికారులపై మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో ప్రైవేట్ కేసు వేశారు రాజలింగమూర్తి.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





