March 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

తల్లితో అక్రమ సంబంధం.. 10వ తరగతి కూతురికి కడుపు చేసిన కిరాతకులు


నెల్లూరు జిల్లాలో తల్లితో వివాహేత సంబంధం, ఆమె కుతుర్నే గర్భవతి చేసిన దారుణం వెలుగుచూసింది. వెంటకగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో షేక్ రబ్బానీ(38) బాధితురాలి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని, కూతురిపై కన్నేశాడు. మరో వ్యక్తితో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు.
.ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పదో తరగతి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులపై వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో చట్టంపై కేసు నమోదు చేశారు. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు గర్భవతిని చేశారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది

ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. షేక్ రబ్బానీ బాధితురాలి తల్లితో గతకొంతకాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని తెలిసింది. బాలిక ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి షేక్ రబ్బానీ బాలికపై కన్నేశాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.


గత కొన్నిరోజులుగా బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి.. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసింది. బాలిక గర్భం దాల్చిందని డాక్టర్లు నిర్థారించారు. దీంతో బాధితురాలి తల్లి షేక్ రబ్బానీ(38), చినబాబు అలియాస్ బాలులపై పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద FIRలో నమోదు చేశారు.

Also read

Related posts

Share via