పంజాబ్‌లోని లూథియానాలో దారుణం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అనోఖ్ మిట్టల్ తన భార్యను హత్య చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చి చంపేశాడు. పోలీసులు అనోఖ్ మిట్టల్ తో పాటుగా అతని ప్రేయసి ప్రతీక్ష (24)తో పాటుగా నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లను అరెస్టు చేశారు.
పంజాబ్‌లోని లూథియానాలో దారుణం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అనోఖ్ మిట్టల్ తన భార్యను హత్య చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చి చంపేశాడు. పోలీసులు అనోఖ్ మిట్టల్ తో పాటుగా అతని ప్రేయసి ప్రతీక్ష (24)తో పాటుగా నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లను అరెస్టు చేశారు. అనోఖ్ మిట్టల్ భార్య 33 ఏళ్ల లిప్సే మిట్టల్, శనివారం హత్యకు గురైంది. లూథియానా-మలేర్కోట్ల రోడ్డులోని ఒక హోటల్‌లో భోజనం చేసి తాను, తన భార్య తిరిగి వస్తుండగా, దొంగలు తమపై దాడి చేసి తమ కారును దోచుకున్నారని అనోఖ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భర్తే ప్రధాన నిందితడు .
అయితే, లిప్సీ హత్య వెనుక ఆమె భర్త హస్తం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. వ్యాపారవేత్త అయిన అనోఖ్ మిట్టల్ (35) తన 24 ఏళ్ల ప్రేమసి ప్రతీక్షతో కలిసి ఈ కుట్ర పన్నాడని పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, లిప్సీ తన భర్తకు ప్రతీక్షతో అక్రమ సంబంధం గురించి తెలిసింది. అయితే ఈ విషయం ఎక్కడ బయటపెడుతుందో అని అనోఖ్ తన భార్యను అంతమొందించడానికి పథకం పన్నాడు. ఈ పనికి కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుని రూ.2.5 లక్షలు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. అందులో రూ.50వేలు అడ్వాన్స్ గా ఇచ్చాడు.
ఈ కేసులో పోలీసులు అనోఖ్ మిట్టల్, అతని లవర్ తో పాటుగా నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లను అరెస్టు చేశారు. వారిని అమృత్‌పాల్ సింగ్ అలియాస్ బల్లి (26), గురుదీప్ సింగ్ అలియాస్ మన్నీ (25), సోను సింగ్ (24), సాగర్‌దీప్ సింగ్ అలియాస్ తేజీ (30)గా గుర్తించారు. వీరిలో అమృత్‌పాల్, గురుదీప్, సోను నంద్‌పూర్ గ్రామ నివాసితులు కాగా, సాగర్‌దీప్ ధండారి కలాన్ నివాసి. కాంట్రాక్ట్ కిల్లర్ల ముఠా సూత్రధారి గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపి ఇంకా పరారీలో ఉన్నాడు . అతని కోసం గాలిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై మరింత దర్యాప్తు చేస్తున్నారు. నేరానికి ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. మిట్టల్ మూడు నెలల క్రితం ఆప్‌లో చేరాడు. ఎమ్మెల్యే అశోక్ పరాశర్ పప్పీ ద్వారా పార్టీలోకి వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే.. పోలీసుల దర్యాప్తులో ఇది మిట్టల్ తన భార్యను చంపడానికి చేసిన మొదటి ప్రయత్నం కాదని తేలింది. గతంలో రెండు సందర్భాలలో ఆమె హత్యకు ప్రయత్నించాడని వెల్లడించారు పోలీసులు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..