స్మార్ట్‌ఫోనుల పుణ్యమా అని చావులను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే కలికాలం దాపురించింది. ఆర్థికసమస్యలు, గొడవలు, అప్పులు ఇలా సమస్య ఏదైనా కానీ ఓ సెల్ఫీవీడియో తీసుకొని అందరికీ పంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పశ్చిమగోదావరిజిల్లాలో అలాంటి వీడియోనే కలకలం రేపింది.
Selfie Video : స్మార్ట్ ఫోనుల పుణ్యమా అని చావులను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే కలికాలం దాపురించింది. ఆర్థికసమస్యలు, గొడవలు, అప్పులు ఇలా సమస్య ఏదైనా కానీ ఓ సెల్ఫీ వీడియో తీసి అందరికీ పంపి మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా లోనూ అలాంటి వీడియోనే కలకలం రేపింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగోట్టుకున్న ఓ యువకుడు చనిపోతున్నానంటూ తన బంధవులకు వీడియో పంపడంతో అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, బంగారుపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు పేరుపాలెం బీచ్ లో సూసైడ్ చేసుకుని చనిపోతున్నానంటూ తన బంధువులకు సెల్ఫీ వీడియో పంపించాడు. కంగారు పడ్డ బంధువులు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పేరుపాలెం బీచ్‌లో మొగల్తూరు పోలీసులు గాలింపులు చేపట్టారు.
ఆ యువకుడు తన సెల్పీ వీడియోలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఇంత వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. అప్పులు చేసి ఆన్ లైన్ బెట్టింగ్ ఆడానని.. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు పేరుపాలెం సముద్రం ఒడ్డున ఒక బైకు కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ బైక్ యువకుడిదిగా భావిస్తున్నారు. సెల్ఫీ వీడియో తీసిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, బంగారుపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. బీచ్‌లో యువకుడి ఆనవాళ్లేవి దొరకకపోవడంతో అతని ఇంటికి వెళ్లడానికి పోలీసులు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అన్ని విషయాలు మీడియాకు వెళ్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Also read
- ఈ రాశుల వారికి జాక్‌పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు