February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

CRIME NEWS: జనసేన కీలక నేత కిరణ్ రాయల్ నన్ను మోసం చేశాడు.. మహిళ సంచలన వీడియో!


జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని లక్ష్మి అనే మహిళ వీడియో రిలీజ్ చేసింది. రూ.1.20 కోట్లు తీసుకుని రూ.30 లక్షలకు బాండ్ రాయించుకున్నాడని తెలిపింది. డబ్బులు అడిగితే పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని.. అందుకే చనిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ అయిన ఓ వ్యక్తి బండారాన్ని ఓ మహిళ బయటపెట్టింది. అతడు తనను ఎంతగా మోసం చేశాడో వివరించింది. దాదాపు రూ.కోటికి పైగా అప్పు తిసుకున్నాడని.. తిరిగి అడిగితే బెదిరిస్తున్నాడని ఆమె పేర్కొంది. తనకు ఇక చావే దిక్కు అని చెప్తూ ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

ఆ వీడియో ప్రకారం.. తన పేరు లక్ష్మి అని తెలిపింది. లైఫ్‌లో ఒకరిని నమ్మి చాలా మోసపోయానని.. అప్పు చేసి మరీ రూ.1.20 కోట్లు ఇచ్చానని తెలిపింది. అయితే అతను మాత్రం తన పిల్లలను చంపుతానని బెదిరించాడని.. ఎన్నో చేశాడని.. కేవలం రూ.30 లక్షలకు తన వద్ద బాండ్, చెక్కులు రాయించుకున్నాడని పేర్కొంది.

నేనిక బతకలేను
అక్కడితో ఆగకుండా తనను కూడా బెదిరించి వీడియో రికార్డు తీసుకున్నాడని తెలిపింది. అయితే తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను ఉన్నాయని ఆ వీడియోలో పేర్కొంది. అప్పులు ఎక్కువైపోయాయని.. పిల్లలకు సమాధానం చెప్పలేకపోతున్నానని.. ఇక తాను బతకలేనని తెలిపింది



అతడు మరెవరో కాదు
అతను మరెవరో కాదని.. తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయ్ అని అతడి పేరును బయటపెట్టింది. ఇక తాను చనిపోయిన తర్వాత అయినా.. ఆ డబ్బులు తన పిల్లలకు చెందుతాయని ఆమె ఆశిస్తున్నట్లు చెప్పింది. ఇక తాను కేవలం కిరణ్ వల్లే చనిపోతున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.



Also read

Related posts

Share via