February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

కిర్లంపూడిలో ముద్రగడ నివాసంపై దాడి.. ట్రాక్టర్‌తో ముద్రగడ నివాసం గేటు ఢీకొట్టిన వ్యక్తి



కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసంపై దాడి జరిగింది. ట్రాక్టర్‌తో ముద్రగడ నివాసం గేటును ఢీకొట్టాడు ఓ వ్యక్తి. అక్కడ పార్క్‌ చేసి ఉన్న కారును కూడా ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. అతను జనసేన కార్యకర్తగా అనుమానిస్తున్నారు ముద్రగడ వర్గీయులు. ప్రస్తుతం యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తనకు50 వేలు ఇస్తానంటేనే ఎటాక్ చేశానని ఆ యువకుడు చెప్తున్నాడు. అయితే ముద్రగడ నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది. ముద్రగడ అంటే పవన్‌కు, పార్టీ నేతలకు గౌరవం ఉందన్నారు జగ్గంపేట జనసేన ఇన్‌చార్జ్‌ తుమ్మలపల్లి రమేష్‌, దాడికి, జనసేనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇలాంటి దాడులను మేము ఉపేక్షించమని చెప్పారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసంపై దాడి జరిగింది. ట్రాక్టర్‌తో ముద్రగడ నివాసం గేటును ఢీకొట్టాడు ఓ వ్యక్తి. అక్కడ పార్క్‌ చేసి ఉన్న కారును కూడా ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. అతను జనసేన కార్యకర్తగా అనుమానిస్తున్నారు ముద్రగడ వర్గీయులు. ప్రస్తుతం యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తనకు50 వేలు ఇస్తానంటేనే ఎటాక్ చేశానని ఆ యువకుడు చెప్తున్నాడు.


అయితే ముద్రగడ నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది. ముద్రగడ అంటే పవన్‌కు, పార్టీ నేతలకు గౌరవం ఉందన్నారు జగ్గంపేట జనసేన ఇన్‌చార్జ్‌ తుమ్మలపల్లి రమేష్‌, దాడికి, జనసేనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇలాంటి దాడులను మేము ఉపేక్షించమని చెప్పారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ దాడి విషయం తెలిసి ముద్రగడ పద్మనాభం అనుచరులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇటీవలే ప్రత్తిపాడు నియోజకవర్గంలో గ్రామస్థాయి పర్యటనలు మొదలు పెట్టారు ముద్రగడ కుమారుడు గిరిబాబు. దానికి ప్రజల్లో మంచి స్పందన రావడంతోనే ఇలా దాడి జరిగి ఉంటుందని ముద్రగడ అనుచరులు చెప్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైసీపీ సమన్వయకర్తగా ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిని నియమించింది వైసీపీ అధిష్టానం.


గత ఎన్నికల్లో కుమారుడికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ముద్రగడ పద్మనాభం. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు టికెట్ దక్కలేదు. ఇటీవల సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించే అవకాశం ఉందంటూ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ముద్రగడ ఇంటిపై దాడి జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

Also read

Related posts

Share via