ఇందుకూరుపేట(నెల్లూరు): మండలంలోని ఆదెమ్మసత్రానికి చెందిన అంతోజీ దుర్గా (14) అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఎస్సై నాగార్జునరెడ్డి వివరాలు తెలియజేశారు. ఆదెమ్మసత్రానికి చెందిన వేణుగోపాలాచారి, లావణ్య దంపతులకు కొడుకు, కుమార్తె సంతానం.
కుమార్తె దుర్గా ఆదెమ్మసత్రం జెడ్పీ ఉన్నత పాఠశాల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజులాగే మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంది. రాత్రి దుర్గా బాత్రూంలోకి వెళ్లింది. ఎంతకీ బయటకు రాకపోవడంతో తల్లి కేకలు వేస్తూ బలవంతంగా తలుపును తోసింది. చున్నీతో దుర్గా ఉరేసుకుని కనిపించింది.
కిందకు దించగా అప్పటికే చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై నాగార్జునరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బుధవారం సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు పాఠశాలకు వెళ్లి దుర్గా స్నేహితులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.
Also read
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్‌పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..
- జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం





