Telangana: పట్టణానికి చెందిన పాలడుగు రాజు తన లారీని గత నెల 24న తిప్పర్తి మార్కెట్ యార్డులో పార్కింగ్ చేశాడు. ఆ లారీని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో రాజు తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి..
వీరి కన్ను పడితే చాలు మాయం. ఏదో చిన్న వస్తువులు అంటే అనుకోవచ్చు.. కానీ భారీ వాహనాలనే మాయం చేస్తుంటారు. రాత్రిపూట రెక్కీ వేసి పట్టపగలే మాయం చేస్తుంటారు. ఈ దొంగల తెలివి చూసి పోలీసులే షాక్ తిన్నారు. జల్సాల కోసం చేసిన అప్పులను తీర్చే మార్గం లేక దొంగతనాలకు అలవాటు పడ్డారు లారీ డ్రైవర్లు. మీరు రాత్రి పూట రెక్కి వేసి పట్టపగలే లారీలను మాయం చేస్తున్నారు. ఇలా మాయం చేసిన లారీలను అమ్మేస్తుంటారు. ఈ ముఠా పోలీసుల వలకు చిక్కి.. కటకటాల పాలయ్యారు.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఆయిటి పాముల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్లు మెండె వెంకన్న, గుజ్జంటి శ్రీనివాస్, కొరుపులు సాయికుమార్, కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన కొండా సురేష్ జల్సాలకు అలవాటు పడి అప్పులు చేశారు. అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. వీరందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి తమకు అనుభవం, పరిజ్ఞానం ఉన్న లారీలపై దృష్టి పెట్టారు. కార్లలో రాత్రిపూట రెక్కీ వేసి పార్కింగ్ చేసిన లారీలను గుర్తించేవారు. ఇలా గుర్తించిన లారీలను పట్టపగలే మాయం చేస్తున్నారు. దొంగిలించిన లారీలను నెంబర్ ప్లేట్లను మార్చి విజయవాడ ఆటోనగర్ లో విక్రయించి సొమ్ము చేసుకుంటోంది ఈ ముఠా. దీంతో అప్పులు తీర్చడంతోపాటు జల్సాలను కొనసాగిస్తున్నారు.
నల్లగొండ పట్టణానికి చెందిన పాలడుగు రాజు తన లారీని గత నెల 24న తిప్పర్తి మార్కెట్ యార్డులో పార్కింగ్ చేశాడు. ఆ లారీని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో రాజు తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీ డ్రైవర్లు మెండె వెంకన్న, గుజ్జంటి శ్రీనివాస్, కొరుపులు సాయికుమార్, కొండా సురేష్ నంబర్ ప్లేటు లేని రెండు కార్లలో వెళ్తుండగా ఆపారు. వారిని అదుపులో తీసుకొని విచారించగా.. లారీల మాయం బయటపడింది. తిప్పర్తిలో లారీ చోరీ చేసిన లారీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అరికె రవి ద్వారా విజయవాడలోని ఆటోనగర్ హబీబ్ రెహ్మన్ కు అమ్మేసినట్లు అంగీకరించారు.
ఈ నెల 5వ తేదీన చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద పెట్రోల్ బంక్ లో పార్కింగ్ చేసిన లారీని కూడా ఈ ముఠా దొంగిలించి అమ్మేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అదేవిధంగా గుజ్జంటి శ్రీనివాస్, మెండె వెంకన్న ఫైనాన్స్ లారీని తీసుకొని ఈఎంఐలు కట్టకుండా ఫైనాన్స్ కంపెనీలను మోసం చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. నిందితుల నుండి రెండు కార్లు, రెండు లారీలు స్వాధీనం చేసుకుందామని చెప్పారు. పరారీలో మరో ఇద్దరు లారీ దొంగలు ఉన్నారని శివరాం రెడ్డి చెప్పారు. పార్కింగ్ చేసిన లారీల విషయంలో యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Also Read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!