తన భార్య భాగ్యరేఖ బాలల హక్కుల కమిషన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఈ పేరుతో తయారు చేసిన ఓ నకిలీ గుర్తింపు కార్డు కూడా చూపించడంతో మధు నమ్మాడు. పైనాపిల్ కాలనీలో టిడ్కో ఇళ్లు ఇప్పిస్తానని పలు దఫాలుగా రూ.80వేలు తీసుకున్నారు. అలాగే రమ అనసూయ అనే మహిళతో జీవీఎంసీˆ కమిషనర్‌గా పరిచయం చేసుకుని రూ.లక్ష వరకు తీసుకున్నారు. అయితే ఎలాంటి ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారిపై దొంగతనం కేసు పెడతానని భాగ్యరేఖ బెదిరింపులకు దిగింది. బాధితులు భాగ్యరేఖ, ఆమె భర్త చంద్రశేఖర్‌లపై ఈనెల 22న ఎంవీపీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో పోలీసులు భాగ్యరేఖని నకిలీ ఐ.ఎ.ఎస్.గా గుర్తించారు. ఫిర్యాదు అందిందని తెలియగానే వీరిద్దరూ పరారయ్యారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒంగోలు వద్ద అదుపులోకి తీసుకుని విశాఖ తీసుకువచ్చారు. నిందితురాలు భాగ్యరేఖ గతంలో ఇలాగే కంచరపాలెం పరిధిలో కూడా పలువురిని మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి.
Also read
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..





