April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: యాప్‌లో కారు బుక్ చేసుకుని ఏపీలోకి ఎంటర్ అయ్యారు.. పోలీసులను చూసి పొదల్లోకి.. చివరకు

 

ఇద్దరూ గంజాయి స్మగ్లర్లు. అల్లూరి జిల్లాకు చెందిన మర్రి సత్తిబాబుతో పరిచయమయ్యారు. గంజాయిని తరలించాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఇక తమిళనాడుకు కేరళకు చెందిన గంజాయి స్మగ్లర్లు.. అక్కడ రూమ్ కార్ పోస్ట్ అనే యాప్‌లో కియా కారును బుక్ చేసుకున్నారు. టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తామని పది రోజుల అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత నెంబర్ ప్లేట్ మార్చి.. ఏపీలోకి ఎంటర్ అయ్యారు..



అది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతం.. కారు వేగంగా వస్తోంది.. అక్కడే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.. ఇంతలో ఓ కియా కారు.. ఓ బైక్పై కొంతమంది వస్తూ ఉన్నారు.. వెంటనే పోలీసులను చూసి వాహనాలను పొదల్లోకి పోనిచ్చారు.. దీంతో అనుమానం వచ్చి పోలీసులు వెంబడించారు.. పారిపోతున్న వారిని ఆపి చెక్ చేసి ఒక్కసారిగా షాకయ్యారు. కారులో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.. అంతేకాకుండా.. గంజాయ్ స్మగ్లర్లు ఏ విధంగా ఇతర రాష్ట్రాలకు గంజాయ్ తరలిస్తున్నారు..? ఎవరెవరు సహకరిస్తున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.


తమిళనాడు కారు.. ఆంధ్రా రిజిస్ట్రేషన్ నెంబర్..
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన అజిత్ తంగరాజన్, అమల్ సురేష్.. ఇద్దరూ గంజాయి స్మగ్లర్లు. అల్లూరి జిల్లాకు చెందిన మర్రి సత్తిబాబుతో పరిచయమయ్యారు. గంజాయిని తరలించాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఇక తమిళనాడుకు కేరళకు చెందిన గంజాయి స్మగ్లర్లు.. అక్కడ రూమ్ కార్ పోస్ట్ అనే యాప్‌లో కియా కారును బుక్ చేసుకున్నారు. టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తామని పది రోజుల అద్దెకు తీసుకున్నారు. కారు ఒరిజినల్ నెంబర్ TN 05 CL 0165 ను తొలగించి.. అక్కడే ఒక ఫేక్ నెంబర్ను రెడీ చేసుకున్నారు. AP 39 SU 5657 అనే ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ బోర్డును కారుకు తగిలించి.. ప్రయాణమయ్యారు. ఎవరూ ఆపకుండా ఉండేందుకు మరో ప్లాన్ కూడా చేశారు. మీడియా సంస్థ స్టిక్కర్లను సిద్ధం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో తిరిగి ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో సేకరించి సిద్ధం చేసుకున్న సరుకును.. 10 లక్షల 25 వేల రూపాయలకు అమ్మారు. 205 కిలోల గంజాయిని సిద్ధం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వెళ్తూ వెళ్తూ.. మీడియా సంస్థలో పనిచేస్తున్నట్టుగా స్టిక్కర్లను కారు ముందు వెనుక అతికించుకున్నారు.

అలా చిక్కి.. పొదల్లోకి పోయారు..
కేరళకు చెందిన ఇద్దరు అమల్ సురేష్, రంగరాజన్ కారుపై వెళ్తుండగా.. అతనికి ముందు సత్తిబాబు పైలెట్‌గా బైకుపై వెళ్తున్నాడు. ఇంతలో కారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివారు నెల్లిమెట్ట, సాధు పాకల వద్దకు వచ్చేసరికి పోలీసులు కనిపించారు. దీంతో కంగారుపడి కారు బైక్ తో పారిపోయేందుకు ప్రయత్నించారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో పోలీసులు వారిని వెంబడించారు.


పోలీసులు వెంబడించడంతో కారును పొదల్లో ఉంచి పారిపోయిందేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే.. అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురునీ పట్టుకున్నారు. ప్రశ్నించేసరికి… గంజాయి గుట్టు బయటపెట్టారు. డిక్కీలో ఎనిమిది గోనె సంచల్లో దాచిన 25 కిలోల గంజాయితో పాటు 1500 రూపాయల నగదు మూడు సెల్ ఫోన్లు, కారు నేమ్ ప్లేట్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

గతంలో కూడా గంజాయిని కేరళకు తీసుకువెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. తీసుకెళుతున్న గంజాయిని తమిళనాడులోని మధురై కేరళ అలప్పి మన్నార్ ప్రాంతాల్లో కిలో 15 వేల రూపాయలకు అమ్మి లాభాలు పొందుతున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులను ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.

ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని.. పోలీసుల దృష్టి మరల్చడానికి..
గంజాయి స్మగ్లర్లు పోలీసుల దృష్టి మరల్చడానికి చేసిన ప్రయత్నం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘మీడియా సంస్థకు చెందిన స్టిక్కర్ను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకుని.. కారుకు ముందు వెనుక అతికించుకున్నారు. పోలీసులు ప్రజల దృష్టి మరల్చడానికి ఈ పని చేశారని.. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.. వీరితోపాటు ఏజెన్సీకి వచ్చిన మరికొంతమంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు

Also read

Related posts

Share via