February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు ప్ర‌త్య‌క్షం.. ఉపాధ్యాయుల నిర్ల‌క్ష్య‌పు స‌మాధానం..

జ‌గిత్యాల : బ‌డిని గుడిలా భావిస్తారు. గుడిని ఎంత ప‌విత్రంగా ఉంచుకుంటామో.. బ‌డిని కూడా అంతే ప‌విత్రంగా ఉంచుకోవాలి. కానీ ఈ పాఠ‌శాల మాత్రం అప‌విత్రంగా మారింది. అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా మారింది. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ప‌లు చోట్ల కండోమ్ ప్యాకెట్లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి.


రేపు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌గిత్యాల సీఎస్ఐ బాలిక‌ల ఉన్నత పాఠ‌శాల‌ను శుభ్రం చేయించేందుకు ఉపాధ్యాయులు సిద్ధ‌మ‌య్యారు. అది కూడా అటెండ‌ర్ల‌తో కాకుండా.. విద్యార్థినుల చేత శుభ్రం చేయించారు. స్కూల్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న చెత్త‌ను అమ్మాయిలు ఊడ్చుతుండ‌గా.. వారి కంట కండోమ్ ప్యాకెట్లు క‌నిపించాయి. ఆందోళ‌న‌కు గురైన విద్యార్థినులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ టీచ‌ర్లు ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా మాట్లాడారు.





ఈ విష‌యం మీడియా ప్ర‌తినిధుల‌కు, విద్యార్థినుల త‌ల్లిదండ్రుల‌కు తెలిసింది. దీంతో పాఠ‌శాల హెడ్‌మాస్ట‌ర్ సీఎస్ఐ చ‌ర్చ సెక్ర‌ట‌రినీ ప్ర‌శ్నించ‌గా.. సమాజంలో ఇదంతా సహజమేనని, దానికి మేం ఏం చేయాలని నిర్ల‌క్ష్యంగా మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలకు తాము కాపలా ఉండాలా అంటూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీనిపై డీఈవో రాములును వివరణ కోర‌గా వెంటనే ఎంఈఓను పంపించి వివరాలు సేకరించి వారిపై త‌గు చర్యలు తీసుకుంటామన్నారు.

Also read

Related posts

Share via