February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Khammam: చుట్ట తాగుతూ నిద్రలోకి.. ఖమ్మంలో వృద్ధుడు సజీవ దహనం!


ఖమ్మంలో వృద్ధుడు చుట్టు తాగుతూ నిద్రలోకి జారుకోవడంతో సజీవ దహనం అయ్యాడు. అనారోగ్యంతో కదల్లేక మంచానికే పరిమితం అయి ఉన్న వృద్ధుడు చుట్ట తాగుతూ నిద్రలోకి వెళ్లాడు. దానికి ఉన్న నిప్పు రవ్వలు బట్టలకు అంటుకోవడంతో మంటలు చేలరేగి కాలిపోయి ఆ వృద్ధుడు మృతి చెందాడు

ఖమ్మం జిల్లాలో చుట్ట తాగుతూ వృద్ధుడు సజీవ దహనం అయిన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేలకొండపల్లి మండలం రాజేశ్వర పురం ఎస్సీ కాలనీకి చెందిన బత్తిని వెంకులు (70) చుట్టు తాగుతూ నిద్రలోకి జారుకున్నాడు. ప్రమాదవశాత్తు ఆ చుట్టకు ఉన్న నిప్పురవ్వలు పక్కన ఉన్న బట్టలకు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు.

కదల్లేకపోవడంతో మంటల్లో చిక్కుకుని..
వెంకులు గత కొంత కాలం నుంచి అనారోగ్యం కారణంగా మంచాన పడి ఉన్నాడు. దీంతో మంటలు రావడంతో కదల్లేక ఆ మంటల్లో కాలి మృతి చెందాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కూలీ పనులకు వెళ్లారు. దీంతో స్థానికులు గమనించి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే శరీరం మొత్తం కాలిపోయింది. వెంకులు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

ఇదిలా ఉండగా.. ఇటీవల చలిని తట్టుకోలేక మంట వేసుకోవడంతో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. భిలంగానా ప్రాంతంలోని ద్వారి-థాప్లా గ్రామంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో భార్యాభర్తలు గదిలో మంట వేసుకుని నిద్రపోయారు. ఉదయం వారిని నిద్ర లేపేందుకు కుమారుడు వెళ్లి చూడగా.. శవమై కనిపిచారు. మంట పెట్టడం వల్ల గదిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికం కావడంతో ఊపిరి ఆడక భార్యాభర్తలు మృతి చెందారు. తల్లిదండ్రులు చనిపోవడంతో కొడుకు కన్నీరుమున్నీరు అవుతున్నాడు.

Also read

Related posts

Share via