విషాద ఘటన. అన్నం పెట్టే రైతు ఆర్తనాదం ఇది. బ్యాంకు సిబ్బంది వేధింపులకు ఓ రైతు బలయ్యాడు. అప్పు తీసుకున్న బ్యాంకులోనే అందరూ చూస్తుండగానే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి…
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు ఆదిలాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో 2019 లో భూమిని కుదువ పెట్టి 3.50 లక్షల రుణం తీసుకున్నాడు. ఏడాదికి కొంత వడ్డీని కడుతూ వస్తున్నాడు. గత ఏడాది కాలంగా పంటలు సరిగా పండక వడ్డీ కట్టలేకపోయాడు. వడ్డీని చెల్లించలేని లేని పక్షంలో భూమిని జప్తు చేసుకుంటామంటూ బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో తనకు ఇన్నాళ్లు అన్నం పెట్టిన భూమి పోతుందని మనోవేదనకు గురైన రైతు దేవరావు పురుగుల మందు డబ్బాతో బ్యాంకుకు వచ్చి అందరూ చూస్తుండగానే క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.
గమనించిన సెక్యూరిటీ గార్డ్ రైతును పక్కనే ఉన్న కుర్చిలో కూర్చోబెట్టి బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. అంతలోనే రైతు తీవ్ర అస్వస్థకు గురై అక్కడికక్కడే కూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు బ్యాంకు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పెద్ద పెద్ద బడా బాబులు బ్యాంకు లోన్లు తీసుకుని విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటే.. ఏం చేయలేని అధికారులు.. ఇలా చిన్న, సన్నకారు రైతులను వేధింపులకు గురిచేయడంపై పలవురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..