బాలానగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై సమాచారం అందడంతో సకాలంలో స్పందించిన బాలానగర్ పోలీసులు ఆమెను రక్షించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు కాలనీకి చెందిన మంగమ్మ (45) బుధవారం ఫిరోజ్ గూడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ లొ రైల్వే ట్రాక్ పై కూర్చుని ఆత్మహత్యకు యత్నించింది.
దీనిపై సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న కానిస్టేబుళ్లు రవీందర్, సుధాకర్ రెడ్డి ఆమెను రక్షించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!