February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

పదేళ్లుగా భార్యను పుట్టింటికి పంపకపోవడంతో..

• పదేళ్లుగా పుట్టింటికి పంపకపోవడంతో మనస్తాపం

• చింతగట్లలో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన



పెందుర్తి: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు  పాల్పడిన ఘటన పెందుర్తి మండలం చింతగట్లలో చోటుచేసుకుంది. భర్త తరచూ భౌతికదాడికి పాల్పడడంతో తీవ్ర మనస్తాపానికి గురై తనువు చాలించింది. తమ కుమార్తె మృతికి కారణమైన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు గ్రామంలో ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలివీ..

చింతగట్ల గ్రామానికి చెందిన గనిశెట్టి కనకరాజుకు నర్సీపట్నం మర్రివలసకు చెందిన పార్వతితో 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భార్య పార్వతిని కనకరాజు నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లుగా ఆమెను పుట్టింటికి కూడా వెళ్లనివ్వలేదు. నిత్యం ఏదో కారణంతో కొట్టేవాడు. ఈ నెల 11న కూడా పార్వతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై కార్ ఏసీ కూలెంట్ వాటర్ తాగింది.

దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించిన తరువాత ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. తమ కుమార్తె మృతికి కారణమైన కనకరాజును తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు గ్రామానికి చేరుకుని పార్వతి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, అంత్యక్రియలు నిర్వహించారు. కనకరాజు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కె.వి.సతీ(Ūకుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.

Also Read

Related posts

Share via