రాజేంద్రనగర్: పెళ్లయిన 3 వారాలకే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన అరుణ్ (28) ఇదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని (21)తో 21 రోజుల క్రితం వివాహం జరిగింది
అనంతరం వీరు హైదర్‌గూడలో అద్దె ఇంట్లోకి వచ్చారు. అరుణు నైట్ షిఫ్ట్ కాగా.. ఆయన భార్య ఉదయం షిఫ్ట్ ముగించుకుని మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా.. గది తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఘటన స్థలానికి చేరుకొని డోర్ తెరిచి చూడగా అరుణ్ ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025