తెలంగాణలో మరో దారుణం జరిగింది. మెదక్ జిల్లా చేగుంటలో 16 ఏళ్ల బాలికపై లకావత్ ప్రవీణ్, రాజు అనే యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అమ్మాయిని చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై చైతన్యరెడ్డి తెలిపారు.
Crime News: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో బాలిక బలైంది. ఆమె తల్లిదండ్రులు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఇంటి వద్దే ఉన్న చిన్నారిపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న అమ్మాయిపై లైంగిక దాడి చేశారు. ఒకరి తర్వాత ఒకరు విచక్షణ రహితంగా కాంమవాంఛ తీర్చుకోగా చివరికి బాలిక అరుపులతో స్థానికలు నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకోగా ఎస్సై చైతన్యరెడ్డి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మేరకు బాధితురాలైన బాలిక (16) తల్లిదండ్రులు మరమరాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తారు. ఈ క్రమంలోనే వర్గల్ మండలంలోని అనంతగిరిపల్లికి శుక్రవారం వెళ్లారు. అయితే అక్కడే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో బాలిక చిన్నాన్న, అన్న కలిసి వారిని తూప్రాన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీకి తరలించారు. అయితే వారిని చూసేందుకు వెళ్లిన బాలిక చిన్నమ్మను అదే గ్రామానికి చెందిన లకావత్ ప్రవీణ్ బైక్ పై గాంధీ ఆసుపత్రిలో దింపి వచ్చాడు. ఈ క్రమంలోనే బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం గమనించాడు. సాయంత్రం వరకు ఆమెను ఫాలో అయిన ప్రవీణ్.. మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లికి చెందిన రాజును పిలుచుకున్నాడు. అదే రాత్రి గుడిసెలో నిద్రపోతున్న ఆమెపై అగాయిత్యానికి పాల్పడ్డారు.
అయితే అర్ధరాత్రి బాలిక అరుపులు విన్న చిన్నాన్న గుడిసె తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో ఇరుగుపొరుగును పిలిచి తలుపులు తెరవగా అసలు విషయం బయటపడింది. నిందితులను పట్టుకుని దేహశుద్ది చేసి చేగుంట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి బాలికను చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తన్నామని ఎస్సై చైతన్యరెడ్డి చెప్పారు.
Also Read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




