విజయవాడలో ఇద్దరు బాలికలు మిస్సింగ్ కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ఇంట్లో నుంచి బాలికలు వెళ్లిపోయారు. బాలికలు ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP Crime: బాలికల మిస్సింగ్ ఘటనలు రోజురోజుకు కలవరపెడుతున్నాయి. తెలంగాణలో ఘటన మరువక ముందే ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా విజయవాడలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.ఈ ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. నిన్న రాత్రి ఇంట్లో నుంచి బాలికలు వెళ్లిపోయారు. బాలికలు నున్నలో ఆరో తరగతి చదువుతున్నారు.
బాలకలు మిస్సింగ్:
అయితే బయటకు వెళ్లిన బాలుకలు ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికలు ఎక్కడికి వెళ్లారు..? అనే కోణంలో విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికలు ఎక్కడికి వెళ్లారు ఏంటో అనే ఆందోళనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Andhra News: ఆపినా ఆగకుండా దూసుకెళ్లిన కారు.. చేజింగ్ చేసి తనిఖీ చేయగా..
- Andhra Pradesh: కూతురు పెళ్లికి సహకరించిన వ్యక్తిపై పగపెంచుకున్న ఓ తండ్రి.. ఏం చేశాడో తెలుసా..?
- అప్పా, అమ్మా నన్ను క్షమించండి.. మీ పావన
- Guntur: సైకో మంజు టార్గెట్ చేస్తే మిస్ అవ్వదు.. జైలుకు వెళ్ళొచ్చినా మారని బుద్ధి..!
- Andhra Pradesh: వీళ్లేం మనుషులురా బాబు .. మతిస్థిమితం లేని మహిళను గెంటేయడమే కాకుండా..!