మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
గుడివాడ: మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వైసీపీ హయాంలో గుడివాడ టీడీపి కార్యాలయం, ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీని కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించి అతడిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైసీపీ కార్యకర్తలు అరెస్టయి రిమాండ్ లొ ఉన్నారు. తాజాగా కాళీని అస్సాంలో గుడివాడ పోలీసు బృందాలు పట్టుకున్నాయి. వైసీపీ హయాంలో గడ్డం గ్యాంగ్ ముసుగులో నిందితులు అరాచకాలకు పాల్పడ్డారు.
వైసీపీ అధికారంలో ఉండగా 2022 డిసెంబర్ 25న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపి కార్యాలయంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ఈ విషయంపై నమోదైన కేసులో ఇప్పట వరకు 13 మంది కాళీ అనుచరులను ఇటీవల గుడివాడ వన్టైన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ప్రధాన నిందితుడు కాళీ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతడు ఈశాన్య రాష్ట్రమైన అస్సాం వెళ్లి అక్కడ చేపల వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కాళీ కదలికలపై నిఘా ఏర్పాటు చేసి మంగళవారం అరెస్ట్ చేసినట్లు తెలిసింది. దీన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. త్వరలో నిందితుడిని గుడివాడ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.
మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశముంది. గతంలో అరెస్టయిన 13 మంది నిందితులను గుడివాడ వన్టన్ పోలీసులు కస్టడీకి తీసుకుని రెండురోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో వారు కొడాలి నాని ఆదేశాల ప్రకారమే దాడులకు పాల్పడ్డామని వెల్లడించినట్లు సమాచారం. వారి మాట్లల్లో వాస్తవాలు ఉన్నట్లు రుజువైతే కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది.
Also Read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





