ఈరోజు ఎలాగైనా దొంగతనం చేయాలి.. ఫుల్ డబ్బులు కొట్టేయాలి.. ఎవరికి కనిపించకుండా వెళ్లిపోవాలి ఇది అతను వేసుకున్న ప్లాన్.. వేసుకున్న ప్లాన్ ప్రకారమే దొంగతనానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్‌ని చూసి టెంప్ట్ అయ్యాడు. అంతే ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.. వివరాల్లోకి వెళ్తే…

మద్యం షాపులోకి చోరీకి వచ్చిన ఒక దొంగ ఫుల్లుగా మద్యం తాగి అక్కడే నిద్రపోయి..దొరికిపోయిన ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో చోటుచేసుకుంది. నార్సింగి మండల కేంద్రంలోని కనకదుర్గ వైన్స్ నిర్వాహకులు ఆదివారం రాత్రి పనిగంటలు అయిపోగానే… షాపుకు తాళం వేసి వెళ్లిపోయారు. తిరిగి సోమవారం ఉదయం వచ్చి షాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక వ్యక్తి వైన్ షాప్‌లో బాగా మద్యం సేవించి పడుకొని ఉండడం సిబ్బంది గమనించారు. అతిగా మద్యం సేవించి స్పృహలేని స్థితిలో అక్కడ పడిపోయి ఉన్నాడు. వైన్ షాప్ పై రేకులు తొలగించి లోనికి చొరబడిన వ్యక్తి డబ్బులు, మద్యం బాటిల్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాడు.. వెళ్లిపోయే టైంకి..అక్కడ ఉన్న మందు బాటిల్స్ చూసి టెంప్ట్ అయిపోయి.. బాటిల్ ఓపెన్ చేశాడు. అతిగా మద్యం సేవించడంతో.. మత్తు తలకెక్కి సొమ్మసిల్లిపోయాడు. అతడని అదుపులోకి తీసుకున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే అతను షాప్ లోపలికి వచ్చిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి .అయితే లోపలికి వచ్చాక సీసీ కెమెరాలను ధ్వసం చేసాడు దొంగ.. అన్ని బాగానే చేసాడు కానీ మందును చూసి టెంప్ట్ అయ్యి ఫుల్‌గా తాగి ఆగం అయిపోయాడు. ఇక బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read
- అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
- బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?
- షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..!
- ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
- నిడదవోలు నియోజకవర్గం – పట్టణ వివిధ వార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం





