వారిద్దరూ మహబూబ్ నగర్ నుంచి తిరుపతి వెళ్తున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఓ బెర్త్ వచ్చింది. తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోనే వచ్చారు. ఈసారి టూ టైర్ ఏసీ కోచ్‌లో బెర్త్ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇంటికి చేరుకోగానే..
అప్పుడప్పుడూ మనం ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఏదొకటి పొరపాటున పోగొట్టుకుంటూ ఉంటాం. సరిగ్గా ఈ మహిళ కూడా అలాగే పొరపాటున రైలులో బంగారాన్ని పోగొట్టుకుంది. నార్మల్ వస్తువు అయితే పోనీలే.. పోయింది.. ఇక దొరకుదులే అని అనుకుంటాం. బంగారం కదా.! కొంచెం బాధ వేసినా.. దొరకదు అని అనుకోవాల్సిందే. అయితే ఇంతలో వారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ బంగారం సేఫ్‌గా ఉంది.. వచ్చి తీసుకెళ్లండని అవతల వ్యక్తి అన్నారు. అంతే.! సదరు మహిళ ఆనందానికి అవధులు లేవు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన రజిత అనే మహిళ రైల్వేలో టీటీఈగా విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె తిరుపతిలో పని చేస్తుండగా.. ఆదివారం సదరు మహిళకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో డ్యూటీ పడింది. ఈ క్రమంలోనే ఆమె రైలులోని టూటైర్ ఏసీ భోగిని చెక్ చేస్తుండగా.. ఓ బెర్త్ కింద బంగారు బ్రాస్‌లెట్ కనిపించింది. వెంటనే దానిని తీసుకుని.. చిత్తూరు రైల్వే పోలీసులకు అందజేసింది. ఏ కోచ్.? ఏ బెర్త్.? కింద తనకు ఈ బ్రాస్‌లెట్ దొరికిందన్న వివరాలను తెలియజేసింది.
ఈ మేరకు ఖాకీలు టికెట్ రిజర్వేషన్ల ఆధారంగా ఈ బ్రాస్‌లెట్ పోగొట్టుకున్నది మహబూబ్‌నగర్‌కు చెందిన లతగా గుర్తించారు. వారికి వెంటనే సమాచారాన్ని అందించారు. సదరు మహిళ చిత్తూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లి తన బ్రాస్‌లెట్ తిరిగి తెచ్చుకుంది. కాగా, తాము వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుమల దర్శనానికి వచ్చామని.. తిరిగి వచ్చేటప్పుడు రైలులో ఈ బ్రాస్‌లెట్ పోగొట్టుకున్నామని లత తెలిపింది. రూ. 2 లక్షలు విలువ చేసే బ్రాస్‌లెట్ పోవడంతో చాలా కంగారుపడ్డామని చెప్పింది. తమ బ్రాస్‌లెట్ తిరిగి దక్కడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంటూ.. టీటీఈ రజితకు ధన్యవాదాలు తెలిపింది
Also Read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





