ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో మతిస్తిమితం లేని బాలిక (13)ను పక్కింటి యువకుడు గదిలో బంధించిన ఘటన శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు, బాలిక బంధువులు.. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు.
కాలనీవాసుల ఆందోళన.. నిందితుడి ఇంటికి నిప్పు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి సీఐ, ఎస్సై సహా పలువురికి గాయాలు
ఆదిలాబాద్ నేర విభాగం, ఇచ్చోడ, గుడిహత్నూర్, న్యూస్టుడే: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో మతిస్తిమితం లేని బాలిక (13)ను పక్కింటి యువకుడు గదిలో బంధించిన ఘటన శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు, బాలిక బంధువులు.. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. అదుపు చేయడానికి వెళ్లిన పోలీసులపై కాలనీవాసులు రాళ్ల దాడి చేయడంతో సీఐ, ఎస్సై, మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్లోని ఎస్సీ కాలనీలో నివసించే పోశెట్టి (25) తన ఇంటి పక్కనే ఉన్న మతిస్తిమితం లేని బాలికను తన ఇంట్లో బంధించాడు. కూలి పనులకు వెళ్లి సాయంత్రం వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించకపోవడంతో అనుమానం వచ్చి.. పోశెట్టి ఇంట్లో తనిఖీ చేశారు. అక్కడ బాలిక బందీగా ఉండడం చూసి కాలనీవాసులకు సమాచారం అందించారు. కొద్దిసేపట్లోనే పెద్ద సంఖ్యలో స్థానికులు అతడి ఇంటి ముందు గూమిగూడి ఆందోళన చేపట్టారు.
పోలీసులు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. అతడిని తమకు అప్పగించాలంటూ కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈలోగా బాలిక బంధువులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టడంతో ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిపోయింది. కొందరు నిందితుడిపై దాడి చేశారు. నిందితుడిని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై స్థానికులు రాళ్ల దాడికి దిగడంతో సీఐ భీమేష్తో పాటు ఎస్సై తిరుపతి, సీఐ గన్మేన్ భూమేష్, కానిస్టేబుల్ రవీందర్, వాహన డ్రైవర్ నందులకు గాయాలయ్యాయి. ఉన్నతాధికారులు వెంటనే అదనపు బలగాలను అక్కడికి పంపించారు. గాయపడిన పోలీసులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. నిందితుడిని, బాధిత బాలికను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Also Read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..