వరంగల్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వంద రూపాయల కోసం తోటి కార్మికుడని ఇనుపరాడ్లతో కొట్టి చంపారు భవన నిర్మాణ కార్మికులు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
కూలీ పనుల్లో 100 రూపాయల వ్యత్యాసం ఓ వలస కార్మికుడి ప్రాణాలు మింగేసింది. లోకల్, నాన్ లోకల్ వార్ నేపథ్యంలో పొట్ట కూటి కోసం వలస వచ్చిన యువకుడిని అతి దారుణంగా చంపారు ఇద్దరు యువకులు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..
వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలోని SRR తోటలో జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన దిల్‌కుష్ కుమార్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత దారుణంగా ఇద్దరు కూలీలు ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేపట్టరు. కూలీ పనుల్లో లోకల్ నాన్ లోకల్ అనే గొడవే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన దిల్ ఖుషి కుమార్ కొన్నేళ్ల క్రితం తన సోదరుడు దూల చంద్, పవన్ తో వరంగల్ నగరానికి వచ్చాడు. భవన నిర్మాణ రంగంలో కూలీగా పనిచేస్తున్నారు. వీళ్ళు వంద రూపాయలు తక్కువ కూలీకి పనిచేయడం వల్ల స్థానికులకు ఉపాధి దొరకడం లేదు. ఈ క్రమంలో దిల్ ఖుషి కుమార్‌కు స్థానికులైన ప్రశాంత్, నగేష్ అనే ఇద్దరితో తగాదాలు జరిగాయి. ఎక్కడి నుండో వచ్చి మాపై పెత్తనం చెలాయించడం ఏంటని భావించిన ఆ ఇద్దరు కూలీలు అతనితో గొడవపడ్డారు. తమతోపాటే సమానంగా పనిచేయాలని తక్కువ ధరకు పనిచేయవద్దని సూచించారు
మాట మాట పెరగడంతో ఒంటరిగా ఉన్న దిల్ కుష్ కుమార్ పై దారుణానికి ఒడిగట్టారు. నిద్రిస్తున్న యువకుడి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి దారుణ హత్యకు పాల్పడ్డారు. కూలీ పనుల్లో స్థానికులు స్థానికేతరులు అనే గొడవే వీరి మద్య చిచ్చుపెట్టీ వంద రూపాయలు చివరకు ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు
Also read
- Folk Singer Shruthi: పెళ్లై 20 రోజులే.. అనుమాస్పద స్థితిలో ఫోక్ సింగర్ మృతి.. అత్తింట్లో ఏం జరిగింది
- Hyderabad: విగ్గు రాజా.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 50 మందిని..
- Andhra News: ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..
- Andhra Pradesh: హృదయ విదారకర ఘటన.. పడంటి బిడ్డను చూడకుండానే ప్రాణాలు విడిచిన ఎంపీడీవో!
- Andhra News: అడవి పందుల కోసం పెట్టిన ఉచ్చు.. అందులో ఏం చిక్కిందంటే..?