హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. (Telangana News) అయన ను చంచల్ గూడ జైలు నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ అధికారులు నాలుగు రోజుల పాటు విచారించనున్నారు. ఆయన సమక్షంలో బ్యాంకు లాకర్లు తెరవనున్నారు. ఇప్పటికే నిఖేశ్ కుమార్ బినామీ ఆస్తుల వివరాలను అధికారులు సేకరించారు. అతడి స్నేహితులు బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి భారీగా బంగారంతో పాటు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తూ ఇటీవల అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కిన నిఖేశకుమార్ రోజుకు తక్కువలో తక్కువ రూ.2లక్షలపైగా సంపాదించాడు. ఉద్యోగంలో చేరిన అనతి కాలంలోనే అడ్డగోలు సంపాదనకు రుచి మరిగిన నిఖేశ్కుమార్తోపాటు సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో రూ.17.73 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఒక లాకర్లో మరో కిలోన్నర బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో అథమపక్షం రూ.100 కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆయన ఉద్యోగంలో చేరి పదేళ్లవుతోంది. ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్కగడితే సగటున రోజుకు రూ.2లక్షలకు తక్కువ కాకుండానే ఉన్నట్లు తేలుతోంది. ఇంత భారీగా కూడబెట్టేందుకు నిఖేశ్కుమార్ ఎలాంటి కుయుక్తులకు పాల్పడ్డాడనేది తేల్చేపనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. ఆయన మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా అనే విషయాన్నీ తేల్చే ప్రయత్నంలో ఉన్నారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!