December 12, 2024
SGSTV NEWS
CrimeTelangana

విద్యార్థులను తీసుకెళ్తూ.. బ్రేకులు ఫెయిలైన ఆటో.. రెప్పపాటులో తప్పిన భారీ ప్రమాదం..!



రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తోంది ఓ ఆటో. ఈ క్రమంలో ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.



స్కూల్‌ నుంచి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న ఓ ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్ అయి విద్యార్థుల ఆటోకు ప్రమాదం జరిగింది.


రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తోంది ఓ ఆటో. ఈ క్రమంలో ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో రోడ్డు కిందకు వెళ్లి రెండు స్తంభాల మధ్య ఇరుక్కుపోయింది ఆటో. హఠాత్తు పరిణామంతో విద్యార్థులు పెద్దగా అరవడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించారు. వాహనంలో ఇరుక్కుపోయిన విద్యార్థులను రక్షించారు. ప్రమాదంలో విద్యార్థులు ఎవరికి ఏం కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. వాహనదారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫిట్‌నెస్ లేని వాహనాల పట్ల ఆధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

Also Read

Related posts

Share via