పిల్లలకు పాఠాలు చెప్పి, వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రభుత్వ బడి టీచర్ నీచానికి పాల్పడ్డాడు. పిల్లలంతా ఎంతో వేధన అనుభవించారు. ఎవరికి చెప్పాలో.. ఎలా చెప్పాలో.. వారికి అర్ధం కాలేదు. అప్పుడే వారికి మెరుపులాంటి ఐడియా వచ్చింది. అంతే దెబ్బకు టీచర్ కటకటాల పాలయ్యాడు. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్, డిసెంబర్ 6: హైదరాబాద్‌లో ఒక కీచక టీచర్‌కు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. స్కూల్ ఆవరణలో ఉండే సజెషన్ బాక్స్ ను వినియోగించుకొని తామ పడుతున్న బాధను ఫిర్యాదుల రూపంలో లేఖలు రాసి ఆ బాక్సులో వేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో విద్యార్థులు తామ పడుతున్న బాధలను వివరిస్తూ అ లేఖల్లో పేర్కొన్నారు .
హైదరాబాద్‌లోని కబడ్డీ గూడలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటేషన్ పై వచ్చిన సైన్స్ టీచర్ సురేష్ పై ఒకేసారి విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. తమతో టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ.. తమను బ్యడ్ టచ్ చేస్తున్నాడని స్కూల్ ఆవరణలో ఉండే సజెషన్ బాక్స్ లో విద్యార్థినిలు తమ బాధను పంచుకుంటూ లేఖలు రాశారు. స్కూల్ యాజమాన్యం ఈ లేఖలను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు స్కూల్లోకి వచ్చి కీచక టీచర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు నేరం అంగీకరించటంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
స్కూల్ ఆవరణలో ఉండే సజెషన్ బాక్సులు సాధారణంగా ఎప్పుడూ నిరుపయోగంగానే ఉంటాయి. అలాంటిది.. విద్యార్థులతో బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఈ సజెషన్ బాక్స్ లో లేఖ రాసి తమ బాధను వివరించారు. గతంలోనూ శంషాబాద్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ ఘటనలో నేరుగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో.. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ కీచక టీచర్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు..
అయితే ఇప్పుడు మాత్రం విద్యార్ధులు.. ఏకంగా స్కూల్లో ఉండే సజెషన్ బాక్‌ను ఉపయోగించుకున్నారు. తల్లిదండ్రులతో తమ బాధను చెప్పుకోలేక ఈ విధంగా లెటర్ రూపంలో ఫిర్యాదు రాసి సజెషన్ బాక్స్‌లో వాటిని వేశారు. తమ పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు పలుమార్లు తమ బైక్ ఎక్కాలని వేధించేవాడని స్టూడెంట్స్ ఆ లెటర్లో పేర్కొన్నారు. లెటర్లను స్వాధీనం చేసుకున్న స్కూల్ యాజమాన్యం పోలీసులకు వాటిని అప్పగించింది. పోలీసులు వాటిని సాక్షులుగా పరిగణించి కిచక టీచర్ సురేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.
Also read
- మహిమగల చెంబు ఉందంటూ వైద్యురాలి నుండి రూ.1.50 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
- ఆ తల్లికి ఎంత కష్టమొచ్చింది.. మృతదేహంతో స్మశానంలో జాగారం..!
- Hyderabad: సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నం
- Andhra: చవితి వేళ పాలు పోసేందుకు పుట్ట వద్దకు భక్తులు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?




