ఆయనో పార్టీ విద్యార్థి విభాగం నేత.. ప్రేమ పేరిట యువతికి దగ్గరయ్యాడు.. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కులాల ప్రస్తావన తెచ్చి అందుకు నిరాకరించాడు.
బెల్లంపల్లి పట్టణం : ఆయనో పార్టీ విద్యార్థి విభాగం నేత.. ప్రేమ పేరిట యువతికి దగ్గరయ్యాడు.. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కులాల ప్రస్తావన తెచ్చి అందుకు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. బెల్లంపల్లిలోని హనుమాన్బస్తీకి చెందిన జంగపల్లి సాయిస్నేహిత(21), పట్టణంలోని మహ్మద్ఖాసీంబస్తీకి చెందిన భారాసవి నియోజకవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొంతకాలంగా యువతి పెళ్లి చేసుకోవాలని కోరుతుండగా.. కుల ప్రస్తావన తీసుకొస్తూ నిరాకరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం యువతి ఫోన్లో శ్రీనాథ్ సుదీర్ఘంగా మాట్లాడిన అనంతరం ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఇంట్లోనే ఉన్న సోదరి తలుపు తట్టినా తీయలేదు. ఇంతలో శ్రీనాథ్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూకలిసి బలవంతంగా తలుపులు తెరిచారు.
సాయిస్నేహిత చున్నీతో ఉరేసుకొని ఉండటంతో.. కిందికి దించారు. యువతి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్టు గుర్తించిన శ్రీనాథ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు బాధితురాలిని తొలుత బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి యువతి మృతి చెందిందని, బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ నర్సయ్య తెలిపారు. ఈదునూరి శ్రీనాథ్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆయన్ను బి ఆర్ ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ తెలిపారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





