ఏ వాహనంకైనా ముందు దాని కండిషన్ చెక్ చేయడం తప్పనిసరి..! అంతా బాగుంది అని ముందు నిర్ధారించుకుంటేనే ఆ తర్వాతే రోడ్డు మీదికి వెళ్లడం సరైన పద్ధతి.
ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చినంత పని చేసింది. ముందస్తు జాగ్రత్తలు పాటించని ఒక చిన్న తప్పు పెద్ద సమస్యకు దారి తీసింది. లారీ నుంచి ఆయిల్ లీకేజీ జరగడంతో దాదాపుగా 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ మహానగరం మేడ్చల్ పరిధిలో చోటు చేసుకుంది.
ఏ వాహనంకైనా ముందు దాని కండిషన్ చెక్ చేయడం తప్పనిసరి..! అంతా బాగుంది అని ముందు నిర్ధారించుకుంటేనే ఆ తర్వాతే రోడ్డు మీదికి వెళ్లడం సరైన పద్ధతి. ఇక్కడ ఆ తప్పే చేశాడు ఓ లారీ డ్రైవర్. నిర్లక్ష్యమా లేక ఏం జరుగుతుందిలే అనే అతి నమ్మకమా తెలియదు కానీ, అతను చేసిన ఆ తప్పు వల్ల చాలా మంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. హైదరాబాద్ శివారు నాగారం మున్సిపల్ పరిధి ఎస్వీ నగర్లో మెయిన్ రోడ్డుపై వెళ్తున్న ఓ లారీ నుంచి ఆయిల్ లీక్ అయ్యింది.
అది గమనించని ద్విచక్ర వాహనదారులు దాని పైనుంచే వెళ్లడంతో జర్రున జారి ఒకరి తర్వాత ఒకరు రోడ్డుపై పడిపోయారు. ఒకరిద్దరికి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. అలా దాదాపుగా 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. తద్వారా ఒకరు చేసిన తప్పిదానికి అంత మంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. జారిన బండ్లతో రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత అదే మార్గంలో వస్తున్న కొందరు అది చూసి రూట్ మార్చుకుని వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై నుంచి ఆయిల్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇక ఆ మార్గంలో వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!