కోరిన కోరికలు తీర్చే కొమురవెల్లి మల్లన్న అలయానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. దర్శనం అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని తిని తన్మయత్నం చెందుతారు. కానీ.. అక్కడి ప్రసాదం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భక్తులు పరమ పవిత్రంగా భావించే ప్రసాదాల్లో పురుగు కన్పించడం కలకలం రేపింది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రము అయిన కొమురవెల్లి మల్లన్న ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే.. ఇలాంటి ఆలయంలో కూడా భక్తులు తినే ప్రసాదంలో పురుగులు, వెంట్రుకలు రావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు దర్శనానంతరం ప్రసాదాలను కొనుగోలు చేసి దానిని తినేందుకు ప్రయత్నించి అవాక్కయ్యాడు. పులిహోర ప్రసాదంలో పురుగు కనిపించడమే ఇందుకు కారణం..తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున ఆలయం ఇటీవలికాలంలో ఎదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతుంది.
తాజాగా నేడు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాలలో పురుగుల కలకలం రేపింది. అధికారుల నిర్లక్ష్యము కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని భక్తుల ఆందోళన చెందుతున్నారు. ఇటివలి కాలంలో ఇలా తరుచు స్వామివారి పులిహోర ప్రసాదాలలో పురుగులు..లడ్డు ప్రసాదంలో వెంట్రుకలు వస్తన్నాయని భక్తులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





