సంగారెడ్డి టౌన్: గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న స్వాతి (14) శనివారం ఉదయం పాఠశాల రెండో అంతస్తు భవనంలోని గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఉంది.
సమాచారం అందుకున్న డీఎస్పీ సత్తయ్య ఘటన స్థలానికి చేరుకొని.. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబం మదీనాగూడ ఎంఏ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. స్వాతి తండ్రి పండు రాజు, తల్లి దివ్యవాణి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.
కాగా, తమ కూతురు ఆత్మహత్య వెనుక హాస్టల్ వారిపైనే అనుమానం ఉందని మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆమెతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వార్డెన్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





