కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటే ఏపీలో పర్యటన ముగుస్తుందని చెప్పారు. నవంబర్ 11 సోమవారం రోజున తెలంగాణలోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించి అటు నుండి కుంభమేళకు వెళతానని చెప్పారు అఘోరీ నాగసాధు.
గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపించి హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ ఇప్పుడు శ్రీశైలంలో ప్రత్యక్షమైంది. కాషాయ వస్త్రాలు ధరించి శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు లేడీ అఘోరి నాగసాధు. మల్లన్న ఆలయంలో అఘోరీ గురించి తెలుసుకున్న స్థానికులు, భక్తులు ఆమెను చూసేందుకు పెద్దఎత్తున గుమిగూడారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆలయం, పరిసరాల్లో ఎటుంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ఆత్మకూర్ డీఎస్పీ రామాంజీ నాయక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులే దగ్గరుండి అఘోరీకి మల్లన్న దర్శనం చేయించారు.
అనంతరం ఆమె శ్రీశైలం సమాధుల వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. గో హత్యలను అపి, సనాతన ధర్మాన్ని, ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు ఆపాలని డిమాండ్ చేశారు. కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటే ఏపీలో పర్యటన ముగుస్తుందని చెప్పారు. నవంబర్ 11 సోమవారం రోజున తెలంగాణలోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించి అటు నుండి కుంభమేళకు వెళతానని చెప్పారు అఘోరీ నాగసాధు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





