సేలం: ఇనుప మంచం పడి తండ్రి, కుమారుడు మృతి చెందిన ఘటన దిండుగల్ లో ఆదివారం వేకువజా మున చోటు చేసుకుంది. దిండుగల్ సమీపంలో ఉన్న సానర్పట్టి కాలియమ్మన్ కోవిల్ వీధికి చెందిన గోపీకన్నన్ (35) టైలర్గా పని చేస్తున్నాడు. ఇతని భార్య యోగేశ్వరి (32) నత్తం ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తుంది.
వీరికి కుమారుడు కార్తిక్ (10) ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి యోగేశ్వరి పనికి వెళ్లడంతో ఇంట్లో గోపీకన్నన్ మద్యం మత్తులో ఇనుప మంచంపై పడుకుని నిద్రపోయాడు. అతని పక్కన నేలపై కార్తిక్ పడుకున్నాడు. ఈ స్థితిలోవేకువజామున ఇనుప మంచం బోల్టు ఊడి కింద పడింది. దింతో మంచం మధ్యలో తల చిక్కుకుని గోపికన్నన్ కింద పడుకుని ఉన్న
కుమారుడు కార్తిక్ పై పడ్డాడు. దీంతో తండ్రీ, కొడుకులు మృతి చెందారు.
సోమవారం తెల్లవారుజామున లోగేశ్వరి తన భర్త, కుమారుడిని తనిఖీ చేసేందుకు వెళ్లింది. విరిగిన ఇనుప మంచంలో తన భర్త, కొడుకు చనిపోయి పడి ఉండటాన్ని ఆమె గుర్తించింది. ఆమెతో పాటు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. సానర్పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025