తిరుమలలో భక్తుల కంట పడ్డ పాములను పట్టి వాటిని తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడం టీటీడీ ఫారెస్ట్ విభాగం చేస్తోంది. పాములను పట్టుకుని అడవుల్లో తిరిగి వదిలి పెట్టడంలో సిద్ద హస్తుడే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడు. ఇప్పటికే వేలాది పాములను బంధించిన భాస్కర్ నాయుడు మంగళవారం తిరుమల జీయన్సీ గార్డెన్ లోని ఒక గదిలోకి వచ్చిన జెర్రిపోతును పట్టుకున్నారు.
శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్నో జీవరాసులు. అందులో పాములలి ప్రత్యేక స్థానం. వివిధ రకాల విష సర్పాలతో పాటు తిరుమల కొండల్లో మాత్రమే కనిపించే అరుదైన పాములు కూడా ఉన్నాయి. అందుకే విశేష శేషాచలాన్ని బయో స్పియర్ రిజర్వ్ ఫారెస్ట్ గా కూడా కేంద్రం గుర్తించింది. రకరకాల పాములు సందడి చేయడం తిరుమలలో సర్వసాధారణంగా మారిపోయింది. తిరుమలలోని పలు ప్రాంతాలు, భక్తులు స్థానికులు వసతి ఉండే చోట్ల పాములు కనిపించడం సర్వసాధారణంగా మారింది.
దాదాపు 8 అడుగుల కు పైగా ఉన్న పాముని గుర్తించిన గార్డెన్స్ సిబ్బంది భాస్కర నాయుడుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయన అక్కడికి వాలి పోయాడు. అక్కడున్న 8 అడుగుల జెర్రిపోతుతో పాటు రింగ్ రోడ్ లోని డ్రైనేజీ వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న మరో నాలుగు అడుగుల పొడవైన నాగుపామును కూడా భాస్కర్ నాయుడు చాకచక్యంగా పట్టుకున్నాడు. ఇలా రెండు విష సర్పాలను పట్టుకోవడంతో అక్కడున్న భక్తులు ఊపిరి తీసుకున్నారు. రెండు పాములను దట్టమైన అడవిలో వదిలి పెట్టారు
Also read
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





